వందే దత్తాత్రేయం!!

-

(డిసెంబర్‌ 12 దత్తాత్రేయ జయంతి): త్రిమూర్తి స్వరూపం, గురుస్వరూపమై, లోకోద్ధరణకు అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపమే దత్తాత్రే-యుడు. త్రిమూర్తుల సమష్టిరూపం, గురుః బ్రహ్మః, గురుః విషుః్ణ, గురుదేవో మహేశ్వరః అనే శ్లోకానికి ప్రతీక దత్తాత్రేయుడు. అత్రి, అనసూయ దంపుతుల పుత్రునిగా ఆవిర్భవించిన స్మర్తగామి. తనను స్మరించినవారికి వెంటనే అనుగ్ర-హించే సిద్ధుడు దత్తుడు.

డిసెంబర్‌ 12 మార్గశిర పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా అవధూత విశేషాలు…

‘జగదుత్పత్తికర్త్రేచ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే॥
‘ఆదౌ బ్రహా హరిర్మధ్యేహ్యంతే దేవస్సదాశివః
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ! నమోస్తుతే’॥
‘జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయచ
దిగంబర! దయామూర్తే! దత్తాత్రేయ! నమోస్తుతే ॥
దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం. గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం. త్రేతాయు-గంలో దత్తాత్రేయుడు అవతరించినట్లు పురాణాల్లో ఉంది. పుణ్యదంపతులైన అనసూయ, అత్రి మహర్షి-లకు త్రిమూర్తులు ఆయా సందర్భాల్లో ఇచ్చిన వరాల ఫలితంగా బ్రహ్మ సోముడుగా, విష్ణు దత్తుడుగా, శివుడు దుర్వాసుడుగా జన్మించారు. దీనిలో విష్ణు స్వరూపంగా అవతరించిన దత్తాత్రేయుడిలో త్రిమూర్తి అంశలు ఉన్నాయి.

అవతార ఆవిర్భావం: అత్రిఅనసూయః కలిసి దత్తాత్రేయగా నామం వచ్చింది. సహ్యాద్రి శిఖరంపై దత్త భగవానుడు ఆవిర్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఆర్ణీ గ్రామానికి దగ్గర్లో రేణుకాపురం అనే గ్రామం. దీన్నే మాలాపుర గ్రామం అని కూడా అంటారు. ఇక్కడే అత్రి ఆశ్రమం ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని మహూర్‌గఢ్‌గా పిలుస్తున్నారు. దత్త భగవానుడు ఆవిర్భవించిన స్థానం ఇదే.

త్రిమూర్తి అంశ: దత్తాత్రేయుడు త్రిమూర్తి అంశ. దీనిలో విష్ణువు మధ్యలో అటు ఇటూ బ్రహ్మ, మహేశ్వరులు ఉంటారు. ఆయన శంఖం, చక్రం, గదా, పద్మం, త్రిశూలం, డమరుకం, కమండలం, అక్షమాల (జప-మాల) ధరించి వీరాసనంలో ఉంటాడు. వీరాసనం అంటే ఎడమతొడపై కుడికాలుని వేసుకొని తన రెండుపాదాలను, పాదుకలను కన్పించేలా కూర్చో-వడం. వీటితోపాటు తనచుట్టు నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీక. ఇక దూరంగా ఆవు ఉంటుంది. ఇది ఉపనిషత్‌లకు సూచిక. దత్తుడు ధరించిన ఆయుధాలు శత్రు సంహా-రానికి కాదు. కేవలం జ్ఞానమార్గాన భక్తులను ఉద్ధరిం-చడానికి మాత్రమే. ఈ అవతారం జ్ఞానావతారం.

దత్త క్షేత్రాలు: దేశంలో అనేక దత్త క్షేత్రాలు ఉన్నాయి. సహ్యాద్రిలోని దత్త జన్మస్థానం, గుజరాత్‌లోని గిరినార్‌, పిఠాపురం, మైసూర్‌, గానుగాపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కురమగడ్డ, శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురం (మక్తల్‌ మండల్‌), నాగార్జునసాగర్‌కు దగ్గర్లోని ఎత్తపోతల
ఇలా పలు క్షేత్రాలు ఉన్నాయి.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news