ఆదివారం తులసి మొక్కకు నీళ్ళు పోయకూడదట..ఎందుకంటే?

-

హిందువులు దేవుడిని ఎంత శ్రద్దగా ప్రార్దిస్తారో, తులసి మొక్కను కూడా అలానే ప్రత్యేకంగా పూజిస్తారు.దైవ సమానంగా భావించే మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.ప్రతి రోజూ ఉదయం సాయంత్రం చాలా మంది తులసి మొక్కకు దీపారాధన చేసి ఆరాధిస్తూ ఉంటారు.అయితే తులసి మొక్క విషయంలో చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తులసి మొక్కకి నీరు పొసేటప్పుడు చాలామంది వారికి తోచిన సమయంలో నీళ్లు పోస్తూ ఉంటారు.

అయితే ఈ తులసి మొక్కకు నీళ్ళు పొసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఎప్పుడు నీళ్ళు పోయాలి..ఎప్పుడు పూజించాలి వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదు.అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం చాలా మంది తులసి మొక్కకు నీరు పోసి పూజ చేస్తుంటారు. అయితే సంధ్యాసమయంలో తులసి మొక్కకు నీరు పోయకూడదు. సాయంత్ర సమయంలో తులసి మొక్క క్రింద విష్ణుమూర్తి లక్ష్మి దేవి సేదతీరుతూ ఉంటారని, అందుకే సాయంత్ర సమయంలో తులసి మొక్కకు నీరు పోయకూడదు. అదే విధంగా పౌర్ణమి అమావాస్య సూర్య చంద్ర గ్రహణాల సమయంలో నీళ్లు పోయకూడదు.

మన పెరట్లోని తులసి మొక్కకు ఎండిన ఆకులు ఎక్కువగా ఉంటే ఆ మొక్కను తీసి, ఎవరూ తిరగని చోట వదిలివేయాలి.ఆ తులసి స్థానంలో కొత్త తులసి మొక్కను నాటాలి.ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో అశుభాన్ని సూచిస్తుంది. శాస్త్రం ప్రకారం ఆదివారం ఏకాదశి రోజులలో తులసి మొక్కను పొరపాటున కూడా తాకకూడదు. అయితే ఆరోజు తులసి మొక్కకు పూజ చేయడం ఎంతో శుభప్రదం. ఇక చాలామంది తులసి ఆకులను గోళ్లతో గిల్లుతూ ఉంటారు.స్నానం చెయ్యకుండా అస్సలు తులసి మొక్కను తాక కూడదు..అలా చేయడం వల్ల కుటుంబ చికాకులు కలుగుతాయని కొందరి నమ్మకం.

Read more RELATED
Recommended to you

Latest news