సూర్యగ్రహా అనుగ్రహం కోసం ఇలా చేయండి!

-

చాలామందికి సూర్య లేదా రవి దోషాలు ఉంటాయి, తరుచూ ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు వస్తుంటాయి అటువంటివారు కింది పరిహారాలను శ్రద్ధతో ఆచరిస్తే తప్పక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఔషధాలు తీసుకునాన దైవానుగ్రహం ఉంటే మరింత సులభంగా, సత్వరంగా ఏదైనా పరిష్కారం అవుతుంది. సూర్య అనుగ్రహం కోసం …

Do these things to get Surya Graham blessings

సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసం ఉండాలి. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. ఉపవాసం ఉన్న రోజు తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాలి. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసం తో దానమిచ్చుట శుభము.

పైవాటిని ఆచరించడానికి ఇబ్బందులు ఉంటే మొదట భక్తి ,శ్రద్ధతో నవగ్రహాలలో సూర్యుని ముందు నిలబడి స్వామి నా సమస్యలు పరిష్కారం అయితే నేను విధివిధానం ప్రకారం పూజ చేసుకుంటాను అని మొక్కుకోవాలి. సూర్యునికి సంబంధించి జపాకుసుమ సంకాశం.. అనే శ్లోకాన్ని లేదా ఓం నమో భాస్కరాయనమః లేదా ఓం నమో సూర్యనారాయణాయనమః అనే నామాన్ని భక్తి శ్రద్దతలో కనీసం 108కి తగ్గకుండా పారాయణం చేయాలి, ఎర్రనిపూలు, గోధుమలను సూర్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కనీసం 7 వారాలక తగ్గకుండా చేస్తే తప్పక మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉండాలనుకువారు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే స్నానసంధ్యాలు పూర్తి చేసుకుని సూర్యనమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా పారిపోతాయి. అంతేకాదండి మీ పిల్లలక జ్ఞాపకశక్తి చాలా వేగంగా పెరుగుతుంది పాటించి లాభాలను పొందండి.
ఓం నమో సూర్యనారాయణాయనమః

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news