చెట్టును చూసి దాని కొమ్మ‌ల‌కు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించ‌వ‌చ్చ‌ట‌.. ఆ విద్య ఏంటో తెలుసా?

904

అక్ష విద్య నేర్చుకున్నవారు సంఖ్యా విదుదౌతాడు, పాపదోషాల నుంచి విముక్తి పొందుతాడు అని రుతుపర్ణుడు బాహకుడికి చెప్తాడు. తర్వాత దమయంతి స్వయం వరానికి హాజరైన తర్వాత బాహకుడే నలుడని రుతుపర్ణుడు తెలుసుకుంటాడు.

పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో విలువిద్య, అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో విద్యే ఎదురుగా ఉన్న చెట్టును చూసి దాని కొమ్మలకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించేవారు. ఈ విద్యను అక్ష హృదయం అని అంటారు.

పూర్వం ద్వాపర యుగంలో అయోధ్యను పరిపాలించిన రాజు రుతుపర్ణుడు. ఆయన దగ్గర నలుడు గుర్రాల సంరక్షకుడిగా చేరుతాడు. ఆ సమయంలో ఆయన పేరు బాహుకుడు. కొంతకాలానికి దమయంతి పునః స్వయం వరాన్ని ప్రకటించి రుతుపర్ణుడిని ఆహ్వానించగా కేవలం ఒక్కరోజులో ఆయోధ్య నుంచి దమయంతి ఉన్నదగ్గరికి పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో రుతుపర్ణుడు తన అశ్వ సంరక్షకుడి ప్రతిభను గుర్తించి నల్లని వికార రూపంలో ఉన్న బాహుకుడు (నలుడు) తన రథసారథిగా తీసుకుని పోతాడు. ఆయన కేవలం గంటల వ్యవధిలో గమ్యాన్ని చేరుస్తాడు. ఆ సమయంలో రుతుపర్ణుడు తనకు వచ్చిన అక్ష హృదయం విద్యను ప్రదర్శిస్తాడు. మార్గమధ్యంలో ఒక చెట్టు దగ్గర రథాన్ని ఆపి ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో తన విద్య ద్వారా క్షణాల్లో చెప్తాడు. దాంతో బాహుకుడు ఆశ్చర్యపోతాడు. తర్వాత రుతుపర్ణుడు నలునికి ఆ విద్యను బోధించి దానిలోని మర్మాలను చెప్తాడు.

అక్ష విద్య నేర్చుకున్నవారు సంఖ్యా విదుదౌతాడు, పాపదోషాల నుంచి విముక్తి పొందుతాడు అని రుతుపర్ణుడు బాహకుడికి చెప్తాడు. తర్వాత దమయంతి స్వయం వరానికి హాజరైన తర్వాత బాహకుడే నలుడని రుతుపర్ణుడు తెలుసుకుంటాడు. మహారాజైన నలునికి తన అక్ష హృదయ విద్యను చెప్పి దానికి బదులుగా నలుని దగ్గర అశ్వహృదయ విద్యను నేర్చుకుంటాడు. ఉపదేశం పొందుతాడు. దీంతో ఏ గుర్రాన్ని ఎలా చూడాలి, ఎలా క్షణాల్లో గమ్యాన్ని చేరాలి ఉత్తమ గుర్రాల ఎంపిక, తదితర సూక్ష్మ మర్మాలను రుతుపర్ణుడు నలుని వద్ద నేర్చుకుంటాడు. ఇప్పుడు తెలిసిందా.. అక్ష హృదయం, అశ్వ హృదయ విద్యల గురించి.

– కేశవ