బొట్టు పెట్టుకోవడం వలన ఇన్ని లాభాలను పొందవచ్చని మీకు తెలుసా..?

-

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మోడరన్ అలవాట్లకే అలవాటు పడిపోయారు. సాంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్నారు. కానీ పెద్దలు మాత్రం ఇంకా మనం పాటించే సంప్రదాయాలని చెప్తూ ఉంటారు. రోజులు మారే కొద్ది మనుషుల్లో ఎంతో మార్పు వస్తోంది. స్త్రీలు చక్కగా చేతినిండా గాజులు వేసుకుని ముఖానికి బొట్టు పెట్టుకునే వారు. ఇప్పుడు రోజు రోజుకీ ఇటువంటి చిన్న పద్ధతుల్ని పాటించే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. అయితే నిజానికి బొట్టు పెట్టుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయి. బొట్టు పెట్టుకోవడం వలన కలిగే లాభాలను పొందవచ్చు. చూశారంటే షాక్ అవుతారు. కొంతమంది పెళ్లయినా, పెళ్లి అవ్వకుండా ఉన్న బొట్టు అందంగా ఉంటుందని పెట్టుకుంటారు. పెళ్లి అయితే మాత్రం కచ్చితంగా బొట్టు పెట్టుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు.

హిందూ సనాతన ధర్మంలో బొట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. బొట్టు పెట్టుకోవడం వెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రాధాన్యత ఏంటి అనేది చూద్దాం.. బొట్టుని రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకోవాలి. రెండు కన్నుల మధ్య స్థలాన్ని ఆజ్ఞ చక్రం అని అంటారు. శరీరంలో ఆరవ అత్యంత శక్తివంతమైన చక్రం ఇది. తల, మెదడు, కళ్ళు, పీనియల్ గ్రంధి అలాగే పిట్యూటరీ గ్రంధి ఇది కలిగి ఉంటుంది. బొట్టు పెట్టుకుంటే భక్తి పొందవచ్చు.

బొట్టు పెట్టుకున్న వాళ్ళని ఎదుటి వాళ్ళు చూస్తే పవిత్రంగా కనబడతారు. ఎదుటి వాళ్ళ నుంచి గౌరవం కూడా వస్తుంది బొట్టు పెట్టుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. మెదడు చాలా ఫాస్ట్ గా పని చేస్తుంది. శరీరం చల్లగా మారెందుకు కూడా ఇది సహాయపడుతుంది. మహిళలే కాదు పురుషులు కూడా పెట్టుకోవచ్చు. ఆడవాళ్లు బొట్టు పెట్టుకోవడం వలన సంతానం కలుగుతుంది. బొట్టు పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచన శక్తిని కూడా పెంచుకోవచ్చు బొట్టు పెట్టుకునే వాళ్లు కుంకుమ బొట్టుని పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news