రుద్రాక్షల్లో ఏయే దేవతలు ఉంటారో తెలుసా!

-

రుద్రాక్షల గురించి తెలియన భారతీయులు ఉంటారు అంటే సందేహమే. వేల ఏండ్ల నుంచి రుద్రాక్షలను ధరించడం భారతీయులకు సంప్రదాయంగా వస్తుంది. సాక్షాత్తు పరమశివుని అంశగా చెప్పే రుద్రాక్షలు పలు రకాలు. వాటిలో ఏకముఖి నుంచి 21 ముఖాల వరకు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆయా రుద్రాక్షలు ఆయా దేవతా స్వరూపాలని శాస్ర్తాలు పేర్కొంటున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం….

ఏకముఖి రుద్రాక్ష – శివస్వరూపం
ద్విముఖి – అర్థనారీశ్వరరూపం
త్రిముఖి – అగ్ని స్వరూపం
చతుర్ముఖి – బ్రహ్మస్వరూపం, సరస్వతికి ప్రీతికరం
పంచముఖి- కాలాగ్ని స్వరూపం
షణ్ముఖి- కార్తికేయ రూపం (సుబ్రమణ్య)
సప్తముఖి- మన్మథుని రూపం
అష్టముఖి- రుద్రభైవర రూపం
నవముఖి- ధర్మదేవతా స్వరూపం
దశముఖి- విష్ణు స్వరూపం
ఏకాదశముఖి- రుద్రాంశ స్వరూపం
ద్వాదశముఖి- ద్వాదశాదిత్య రూపం
పిల్లలకు చదువుకు చతుర్ముఖి, ఆరోగ్యం కోసం షణ్ముఖిని ధరించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version