భక్తి: ఆర్ధిక ఇబ్బందులు నుండి వాస్తు దోషాల వరకు ఇలా తొలగించుకోండి..!

-

మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయిపోతున్నాయా..? ఆర్థికంగా ఇబ్బందులు భరించ లేక పోతున్నారా..? అయితే పండితులు మీకోసం కొన్ని ఉపాయాలు చెప్పారు. వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి.

చాలా మంది కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. కానీ డబ్బులు ఉండవు. అటువంటప్పుడు మంచి జరగాలి అంటే గంగాజలం బాగా సహాయపడుతుంది. పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఎక్కువగా ఆర్థిక నష్టాలు కలిగినా అప్పులు ఎక్కువగా వున్నా, డబ్బులు ఖర్చు అయిపోతున్నా వాళ్లు ఇత్తడి గ్లాసు లో గంగాజలం నింపి ఇంటి ఈశాన్యం మూలన ఉంచాలి. దీనితో వాళ్ళకి అటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

గంగా జలం కి ఎంత పవర్ వుందో మనకి తెలుసు. గంగాజలం నింపిన దానిని ఇంట్లో ఉంచితే ఇంట్లో అంతా కూడా ఆనందంగా ఉండొచ్చు మరియు ధనం కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే చాలా మంది కల లో భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి.

అటువంటి వాళ్ళు రోజూ నిద్ర పోయే ముందు మంచం మీద గంగా జలం జల్లి నిద్రపోతే మంచి కలుగుతుంది. ఇంట్లో వాస్తు దోషాలు తొలగి పోవడానికి, పాజిటివిటీ పెంచడానికి కూడా గంగాజలం బాగా సహాయ పడుతుంది కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు గంగాజలంతో పరిష్కరించకుంటే సమస్యలు సులువుగా మాయమైపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news