హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

-

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, షేక్ పేట్, కృష్ణానగర్, మాదాపూర్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, అమీర్ పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో అర్దరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వాన పడుతోంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి జన సంచారం ప్రారంభం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరింది. మరికొన్ని చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అలాగే వాటర్ సరఫరా కూడా ఆగిపోయింది. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షం కురుసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పొలాలు వేసే సమయంలో వర్షాలు పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాని కొన్ని చోట్ల పంటపొలాల్లోకి నీరు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతాలకు నీరును విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news