ప్రత్యేకంగా ఆరోజు ఇలా చేశారంటే డబ్బుకు లోటుండదట..!!

ఈ మధ్యకాలంలో చాలామంది ఎంత ప్రయత్నం చేసినా.. సంపాదించిన డబ్బు నిలవలేక నీటిలాగా ఖర్చవుతుంది. ఇక ఇలా అయితే భవిష్యత్తు తరాలను కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో సంపాదించి దాచిపెట్టిన డబ్బే రేపటి తరాలకు దారి చూపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక మీరు కూడా డబ్బుకి లోటు ఉండకూడదు అని ఆలోచిస్తున్నట్లయితే హిందూ శాస్త్రం ప్రకారం ప్రత్యేకించి మంగళవారం రోజున అత్యంత పవిత్రమైన పూజ మీరు చేయాల్సి ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత బలశాలి అయిన హనుమంతుడుకి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయట..

ఇక సనాతన ధర్మం ప్రకారం హనుమంతుడు శివుడి అవతారం.. రాముడు భక్తుడు.. ఇక ఈయనను ఒకచోట ఒక్కో రకంగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఇక హనుమంతుడి నామాలను హృదయపూర్వకంగా జపిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. ఇక జీవితంలో సానుకూలత కూడా లభిస్తుంది. ఇంతటి హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రత్యేకించి మంగళవారం రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దీంతో మీకు అదృష్టం కలిసి రావడంతో పాటు జీవితంలో కష్టాలు తొలగిపోయి, సుఖసంపదలు కలుగుతాయి. ప్రతి మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పటించాలి.

ఇక అలాగే పేదలకు, బీదవారికి మీకు తోచిన వస్తువులు దానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఇక మంగళవారం స్నానం చేసిన అనంతరం ఆవుకి ఆహారం తినిపించడం మరింత శుభప్రదం. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది. ఇక 11 రావి ఆకుల పైన జైశ్రీరామ్ అని గంధంతో రాసి హనుమంతుడు ఆలయంలో సమర్పించడం వల్ల డబ్బు ఇబ్బందులు దూరం అవుతాయి. ఇక వివాహం కాని వారు కూడా స్వామివారిని దర్శించుకుంటే వివాహం జరుగుతుంది.