స్వయంభువుడు శ్రీ తాడ్ బండ్ వీరాంజనేయుడు ఆలయ విశేషాలు

-

భాగ్యనగరంలో హనూమాన్ జయంతి వేడుకల ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఏటా వైశాఖ బహుళ దశమినాడు జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ముఖ్యంగా పెద్ద హన్మాన్ జయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమం యాగాదులు నిర్వహిస్తారు. నేడు పెద్ద హనూమాన్ జయంతి ఈ సందర్బంగా సికింద్రాబాద్ లోని సిక్ విలేజ్ లో ఉండే ప్రముఖ హనూమాన్ టెంపుల్ తాడ్ బండ్ వీరాంజనేయస్వామి దేవాలయం పై ప్ర్యతేక కథనం.

స్వయంభూ స్వామి

తాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే… హనూమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకం పై ఉంటుంది. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు. ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. కానీ, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది.

ఇక్కడ వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి. గర్భాలయం మొత్తంను గ్రానైట్ రాయితో నిర్మించారు. ముఖమండపం విశాలంగా ఉంటుంది. విమాన గోపురం, మహారాజ గోపురాలతో శోభాయమానంగా ఉంటుంది.భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాకులు పలు సత్రాలను నిర్మించారు. సత్రాలతో పాటు భోజనశాలలు తదితర సౌకర్యాలు ఈ మందిరంలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు.ప్రతి మంగళ, శనివారాలలో ఇక్కడ స్వామి దర్శనం కోసం వందలాది మంది భక్తులు వస్తుంటారు. వాహన పూజకు ఈ ఆలయం బాగా ఫేమస్. ఇక్కడ స్వామిని దర్శించి పూజలు చేస్తే ఈతి బాధలు, రోగబాధలు పోతాయని భక్తుల విశ్వాసిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news