ఒంటికాలిపై దర్శనమిచ్చే దేవుడు ఎక్కడున్నాడో తెలుసా?

-

అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చొని దర్శనం ఇస్తారు, లేదా కూర్చొని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శయన అంటే పడుకొని అనంత పద్మనాభ స్వామిలాగా దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటారు. అలా ఎందుకు స్వామి వారు దర్శనమిస్తారు? ఈ దేవతా మూర్తిని దర్శించనప్పుడు సహజంగా ప్రతి భక్తునికి కలిగే ఆలోచనతోపాటు ఆశ్చర్యం. అయితే అందుకు కారణం లేకపోలేదని అంటున్నారు స్థానికులు. అలాగే విచిత్ర భంగిమలో నిల్చొని దర్శనమించిచ్చే ఈ ఆలయానికి సమీపంలో ఉన్న నదికి చాలా ప్రత్యేకత ఉంది. మరి స్వామివారు ఇలా దర్శన ఇవ్వడం వెనుక పురాణం కథ ఏమిటి? ఈ ఆలయ విశేషాలేంటో..ఈ ఆలయం ఎక్కడ ఉందో అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం…

history of thiruvikrama perumal temple

తిరువిక్రమ పెరుమాళ్ అనే ఆలయం తమిళనాడు రాష్ట్రం, విలుప్పురం జిల్లాలో తిరుక్కోవళ్ళూర్ అనే గ్రామం ఉంది. ఇది విల్లిపురానికి ఉత్తరంవైపు 45కి.మీ దూరంలో ఉంది. ఇక్కడే తిరువిక్రమ పెరుమాళ్ అనే ఆలయం ఉంది. శ్రీమహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. శ్రీమహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఇక్కడ విష్ణువును ఉలగలంత పెరుమాళ్ గా, లక్ష్మి దేవిని పూంగుతై గా కొలుస్తున్నారు ఈ ఆలయాన్ని ఇది రెండువేల సంవత్సరాల కిత్రం పల్లవరాజులు నిర్మించారని ప్రశస్థి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడొవదిగా ఈ ఆలయం నిర్మాణం అనేక దశలలో జరిగినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయంలో నాలుగు స్థంబాలున్నాయి. అందులో తూర్పువైపుగా ఉన్న స్థంభం 195 అడుగుల ఎత్తు ఉంది. అయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడవదిగా చెబుతారు. పురాణ కథ పూర్వం ఒక సారి దేవాలయం పక్కనే ఉన్న మృకండమహర్షి ఆశ్రమంలోని ఒక మూలకి ముగ్గురు ఆళ్వారులు వర్షం నుండి రక్షించుకోవడం కోసం అని అక్కడ నిల్చొన్నారు. అయితే వీరు ముగ్గరు ఆశ్రమంలో ఉన్న ఒక ఇరుకు గదిలో ఒక రాత్రి అంతా నిలబడి మాట్లాడుకుంటుండగా, వారి మధ్య ఎవరో నిలబడి ఉండటం వలన గది మరింత ఇరుకుగా ఉన్నట్లు అనిపించింది. అప్పుడు ఆ గదిలో వారికి పెరుమాళ్ విగ్రహం దర్శనమిచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆళ్వారుల మనస్సు ఆనందంతో పులకరించింది. ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి.

history of thiruvikrama perumal temple

దేవుని ప్రత్యేకతలు

ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి. ఈ స్వామి వారు సుమారు 21 అడుగుల ఎత్తు ఎడమకాలిపై నిలబడి కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో ఉంటారు. కుడిచేత శంఖం, ఎడమచేత చక్రం ధరించి ఉంటుంది. స్వామి వారి కుడిచేతి చూపుడు వేలు పైకి చూపెడుతూ భక్తులకు దర్శనిమిస్తారు. పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తి పాతాళానికి త్రొక్కిన తర్వాత పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తి పాతాళానికి త్రొక్కిన తర్వాత ఇచట వెలసినట్లు స్థలపురాణం తెలుపుతున్నది. అందువల్లే స్వామి వారు ఒంటికాలిపైన నిలబడి ఉన్నారని స్థలపురాణం తెలియజేస్తున్నది. ఈ స్వామి వారిని తమిళంలో అయ్యన్నార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి పేరు పుషవల్లి తాయార్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే… ఈ ఆలయానికి ఆనుకుని పెన్నానది ప్రవహిస్తుంది. అయితే ఒకప్పుడు బ్రహ్మదేవుడు గంగలో కాళ్ళు కడుక్కుని ఇక్కడికి వచ్చి త్రివిక్రమ స్వామికి ఆరాధన చేసేవాడట. ఆ సమయంలో బ్రహ్మదేవుని పాదములకు ఉన్న గంగాజలం బొట్లు అక్కడ నేలపై పడి పెన్నా నదిగా మారినది. అందుకే ఈ నదిని కూడా గంగానది అంత పవిత్రంగా భావిస్తారు. ఈ పెన్నానదిని దర్శించినవారికి సర్వపాపాలు హరించుకుపోతాయి. ఇక బుషులు ముక్తి పొందిన స్థలంగా మరియు భూలోక స్వర్గంగా తిరుక్కోవళ్లూర్ ను పేర్కొంటారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news