గృహప్రవేశం చేసేటప్పుడు ఈ విషయాలని గుర్తు పెట్టుకోండి..!

-

గృహప్రవేశం నిజంగా పెద్ద వేడుక. ఆరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అయితే ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని విషయాల పట్ల శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. అయితే ఈ రోజు గృహ ప్రవేశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం…! వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించాలి. అలానే గృహ ప్రవేశానికి కేవలం కొన్ని నెలలు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాయి. మీ ఇల్లు కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం వరకు ఆగండి.

అలానే గృహప్రవేశం నాడు తప్పకుండా ద్వారాలకు మామిడాకుల తో తోరణాలు కట్టండి. మామిడాకులని చాలా మంచిగా భావిస్తారు. పైగా ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలానే తోరణాల తో పాటు ఇంటి ముందు ముగ్గు వేయడం మర్చిపోకండి. మీ ఇంటికి మీరు దేవుడిని ఆహ్వానిస్తున్నారు అంటే తప్పకుండా మొత్తం పరిసరాలు అంతా కూడా మంచిగా ఉండాలి.

లక్ష్మీ దేవికి ముగ్గులు అంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి కనక ఇంట్లోకి వచ్చిందంటే ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. అలానే ఇంటి యజమాని కొబ్బరి, పసుపు, బెల్లం, బియ్యం మరియు పాలని తీసుకుని రావాలి. ఇలా తీసుకు రావడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అలానే ముందుగా వినాయకుడిని ఇంట్లోకి తీసుకురావాలి.

అలానే ఇల్లు అంతా కూడా అందంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి ఉంటుంది. అలానే ఎప్పుడైతే మీరు మొట్ట మొదటిసారి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తారో అప్పుడు కుడి కాలు పెట్టి మాత్రమే రావాలి. మీకు వివాహం అయిపోయి ఉంటే మీరు మీ పార్టనర్ తో సహా కుడి కాలు పెట్టి లోపలికి ప్రవేశించాలి.

ఒకసారి మీరు ఒక కొత్త ఇంట్లోకి ప్రవేశించాక 40 రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉండాలి. ముఖ్యంగా ఎవరో ఒక్కరైనా ఆ ఇంట్లో ఉండాలి. అలానే తలుపులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మూయకూడదు. అలానే ఇంటి చుట్టూ తిరిగి లోపలికి ప్రవేశించాలి.

Read more RELATED
Recommended to you

Latest news