కరోనా కారణంగా దేశమంతా 12మిలియన్ల మందికి పైగా దాని బారిన పడ్డారు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా మారుతుంటే స్టాక్ మార్కెట్ మాత్రం పరుగులు పెడుతుంది. ఈ సంవత్సరం మనదేశానికి సంబంధించిన అత్యంత ధనవంతుల జాబితా వచ్చింది. అందులో ముకేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది బిలియనీర్ల జాబితా మరింత పెరిగింది. గత ఏడాది 102 మంది ఉండగా అది ఈసారి 142కి చేరింది. వీరి సంపద 596బిలియన్ డాలర్లుగా ఉంది.
గ్యాస్, టెలికామ్ రంగాల్లో విపరీతమైన వృద్ధి రేటు అందుకున్న ముకేష్ అంబానీ ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఆయన సంపద విలువ 84.5బిలియన్ డాలర్లుగా ఉంది.
1. ముకేష్ అంబానీ
సంపద విలువ: 84.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: వివిధ రకాలు
నివాసం: ముంబయి.
కరోనా కాలంలో ముకేష్ అంబానీ ఆదాయం అంతకంతకూ పెరిగింది.జియో నెట్ వర్క్ లో కొంతమేర ఫేస్ బుక్, గూగుల్ కి వాటా ఇచ్చాడు కూడా.
2. గౌతమ్ అదాని
సంపద:50.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: నిర్మాణ రంగం.
నివాసం: అహమ్మదాబాద్.
ముంబై విమానాశ్రయంలో 74శాతం వాటా అదానీదే.
3. శివ్ నాడార్
సంపద: 23.5 బిలియన్ డాలర్లు
వ్యాపరం: సాఫ్ట్‌వేర్ సేవలు
నివాసం: ఢిల్లీ
ప్రస్తుతం హెచ్ సీ ఎల్ కంపెనీ వ్యాపార కార్యకలాపాలను ఆయన కూతురు రోషిని నాడార్ చూసుకుంటుంది.
4. రాధాక్రిష్ణ దామాని.
సంపద:16.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: రిటైల్
నివాసం: ముంబై
డీమార్ట్ అధినేత.
5. ఉదయ్ కోటక్
సంపద: 15.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: బ్యాంకింగ్
నివాసం: ముంబై
కోటక్ మహింద్రా బ్యాంక్ అధినేత.
6. లక్ష్మీ మిట్టల్
సంపద: 14.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: స్టీల్
నివాసం: లండన్.
ప్రస్తుతం ఆయన కొడుకు ఆదిత్య మిట్టల్ ఎక్సిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నారు.
7. కుమార్ బిర్లా
సంపద: 12.8 బిలియన్ డాలర్లు
వ్యాపారం: కమాడిటీస్
నివాసం ముంబై
8. సైరస్ పూనంవాలా
సంపద: 12.7 బిలియన్ డాలర్లు
వ్యాపారం: వ్యాక్సిన్
నివాసం: పుణె
సీరమ్ ఇంస్టిట్యూట్ అధినేత.
9. దిలీప్ సంఘ్వీ
సంపద:10.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: ఫార్మా
నివాసం: ముంబై.
10. సునీల్ మిట్టల్
సంపద: 10.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: టెలికామ్
నివాసం: ఢిల్లీ
సింగపూర్ కి చెందిన కంపెనీతో జాయింట్ గా ఉండి దేశంలోనే రెండవ పెద్ద టెలికాం కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్ టెల్.