భక్తి: గురువారం విష్ణుమూర్తిని, బృహస్పతిని ఇలా పూజిస్తే మంచి జరుగుతుంది…!

Join Our Community
follow manalokam on social media

హిందూ సనాతన ధర్మం ప్రకారం వారంలో ప్రతి రోజు ను ఒక్కో దేవుని కి అంకితం చేస్తారు. పూజలు, వ్రతాలు తో పాటు ఉపవాసాలు కూడా చేస్తారు. ఈ విధంగా గురువారం బృహస్పతికి అంకితం చేశారు, బృహస్పతి దేవతల గురువు. అందువల్ల ఈ రోజును బృహస్పతి వారంగా భావించుతారు. బృహస్పతి కి మాత్రమే కాదు, గురువారం విష్ణుమూర్తి కి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు. ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలి అంటే గురువారం రోజు ఆయనను పూజించాలి.

గురువారం నాడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వారికి శ్రేయస్సు కలుగుతుంది. దాంతో ఆనందంగా, సంపదతో జీవించుతారు. గురువారం రోజు విష్ణుమూర్తి, బృహస్పతి ఆశీర్వాదం కలగాలంటే ఇవి తప్పక చేయండి. గురువారం వేకువ జామునే నిద్రలేచి తల స్నానం చేయాలి. ఆ తర్వాత బృహస్పతిని, విష్ణువునూ ఆరాధించాలి. పసుపు, పువ్వులు, అక్షింతలతో అష్టోత్తరములు చదువుతూ పూజించాలి.

పూజ అనంతరం బృహస్పతి కవచం మరియు విష్ణు సహస్రం వినడం లేదా చదవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎటువంటి గ్రహ దోషాలు ఉన్న తొలగిపోతాయి. పూజించనా వ్యక్తి కి మరియు కుటుంబ సభ్యులకు ఏ సమస్యలు ఉన్న తొలగిపోతాయి మరియు ఈరోజు ఏమైనా దానాలు చేయాలనుకుంటే తప్పకుండా చేయవచ్చు. పప్పులు, ధాన్యాలు, పుస్తకాలు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. గురువారం నాడు ఆలయాన్ని సందర్శించిన వారు విష్ణువు మరియు బృహస్పతి కి పండ్లు మరియు పువ్వులు అర్పించవచ్చు. ఉపవాసం చేయగలిగిన వారు చేయడం మంచిది. శక్తిలేని వారు ఒక పూట భోజనం చేయవచ్చు , రాత్రికి పండ్లు, ప్రసాదం తినవచ్చు.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...