గురువారం సాయిబాబాకు వాటితో అభిషేకం చేస్తే ఆ దోషాలు పోతాయట..!!

-

గురువారం అంటే బాబాకు ప్రితీకరమైన రోజు..ఈరోజు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎన్నో రకాల దోషాలు తొలగి పోతాయి.అంతే కాదు కొత్తగా చేపడుతున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తీ అవుతాయి. అందుకే భక్తులు గురువారంనాడు బాబాకు ఎక్కడ చూసిన ప్రత్యేక పూజలు జరుగుతాయి.ధూపదీపాలతో పాలకోవాతో నైవేద్యం సమర్పించి బాబాను పూజిస్తారు. అయితే గురువారం బాబా విషయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..

ఈ రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతోపాటు… పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించి…వారితో కొంతసేపు ఆనందంగా గడిపినట్లయితే బాబా కృపకు చేరవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే బాబాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమట. వారితో ఎక్కువ సమయం గడిపేవారని బాబా చరిత్ర చెబుతోంది..

చిన్నారులకు బాబా ప్రసాదాన్ని అందించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజు బాబా పేరిటి అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఫలం దక్కుతుంది.గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అంతేకాదు బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం మరింత మంచిది. అదేవిధంగా గురువారం పూజగదిని ప్రత్యేకించి అలంకరించడం, ధూపదీపాలతో బాబాను పూజించడం మంచిది..జంతు హింస అనేది బాబాకు అస్సలు ఇష్టముండదు..ఇది గుర్తు పెట్టుకొని బాబాను పూజించడం వల్ల ఇంట్లో చికాకులు పోయి సుఖ శాంతులు కలుగుతాయి…

Read more RELATED
Recommended to you

Exit mobile version