మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కొంచెం కష్టమే. కానీ ఇక్కడ నిమ్మకాయతో మనం ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సాధారణంగా మనం చూసినట్లయితే ఇళ్లల్లో నిమ్మకాయతో దిష్టి తీయడం, వాహనాలకి ఇంటికి నిమ్మకాయలు కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. నిజంగానే నిమ్మకాయ వల్ల ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయ్యిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే నిమ్మకాయతో ఎలాంటి సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.
మొదటి రెమిడి:
మీరు వ్యాపారం చేస్తూ ఉంటారా…? వ్యాపారం లో ఇబ్బందులు వస్తున్నాయా..? అయితే ఈ రెమిడి మీకోసం. శనివారం నాడు నిమ్మకాయతో ఈ విధంగా చేస్తే మీ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. దీనికోసం మీరు ఒక నిమ్మకాయ తీసుకుని దానిని నాలుగు ముక్కలు కింద చేయండి. ఇప్పుడు నాలుగు దిక్కులలో నాలుగు ముక్కల్ని వేయండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది. అలానే మీ వ్యాపారంలో కలిగే సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. ఇలా వ్యాపారంలో అధిక లాభం మీరు పొందడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
రెండవ రెమిడి:
మీరు ఎంత కష్టపడుతున్నా సక్సెస్ పొందలేకపోతున్నార..? అయితే ఈ రెమిడి మీకోసం. దీని కోసం మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఒక నిమ్మకాయ, నాలుగు లవంగాలు మీతో తీసుకు వెళ్ళండి. గుడికి వెళ్ళిన తర్వాత నిమ్మకాయ మీద నాలుగు లవంగాలు పెట్టి హనుమాన్ చాలీసా చదవండి. ఆ తరువాత హనుమంతుడు కి పూజ చేయండి. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయలు మీతో తీసుకు వెళ్లి మీరు పనుల్ని చేసుకోండి. దీంతో మీరు విజయం పొందుతారు.
మూడవ రెమిడి:
ఒక నిమ్మకాయ తీసుకుని దానిని ఏడు సార్లు సూదితో గుచ్చి ఆ తర్వాత దానిని విసరండి. ఇలా ఆరోగ్య సమస్యలని తరిమికొట్టొచ్చు. అదేవిధంగా మీరు బయటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ, ఎండుమిర్చి లాంటివి రోడ్డు మీద ఉంటాయి. అటువంటి వాటిని అసలు తొక్కద్దు. అలానే ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్లు కడుక్కోండి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ సమస్యలు తొలగిపోతాయి.