భక్తి: కొబ్బరికాయతో మీ జీవితాన్ని మార్చుకోండి…

కొబ్బరికాయని శ్రీ ఫలం అని కూడా అంటారు. శ్రీ అంటే లక్ష్మీ దేవి. లక్ష్మీ దేవికి కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతి. పూజల్లో కూడా కొబ్బరి కాయ చాలా ముఖ్యంగా ఉపయోగిస్తాము. ఏదైనా మంచి కార్యాన్ని మొదలు పెట్టాలంటే కొబ్బరి కాయతోనే మొదలు పెడతారు. జీవితం లో ఏమైనా సమస్యలు తొలగి పోవాలంటే కొబ్బరి కాయ బాగా పని చేస్తుందని పండితులు అంటున్నారు.

మంగళవారం నాడు కొబ్బరి కాయని ఒక ఎర్ర గుడ్డని చుట్టి హనుమంతుడి పాదాల దగ్గర పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు పూర్తిగా తొలగి పోతాయి. శుక్రవారం నాడు స్నానం చేసిన తర్వాత ఎర్రటి దుస్తులు ధరించి లక్ష్మీ దేవికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి కాయని ఎర్రటి వస్త్రం లో కట్టి ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టాలి.

ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం ఉంటుంది. అలానే సమస్యలు తొలగి పోయి ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. గురువారం నాడు లక్ష్మీ దేవిని పూజించి మరియు విష్ణు మూర్తిని పోషించి కొబ్బరి కాయని తెల్లటి స్వీట్ ని పసుపు రంగు వస్త్రం లో కట్టి విష్ణు మూర్తికి ఇవ్వాలి.

ఇలా చేయడం వల్ల వ్యాపారం లో నష్టం ఉంటే దాని నుంచి బయట పడొచ్చు. మీరు ఎంతో కష్టపడి పని చేస్తున్నా మీకు మంచి కలగక పోతే శని దోషం ఉన్నట్టు. శనివారం నాడు శని దేవుడి దగ్గరికి వెళ్లి కొబ్బరికాయలుని అక్కడ ఉండే నది లో వేస్తే మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.