పంజాగుట్ట షిర్డీ సాయి ప్రేమ సమాజ్ మందిర్ విశేషాలు….!

-

షిర్డీ సాయి బాబా వారు భారత దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తూ అన్ని మతాలు, కులాలు, జాతులు మరియు తెగల నుండి భక్తులను ఆకర్షించేవారు. బాబా దగ్గర శ్రద్ధ, సబూరి లతో స్మరిస్తే భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం బాబా మందిరం. ఆయన భజనలు, కీర్తనలు శరీరానికి కావలసిన మనస్సు, ఆత్మ శాంతి, ప్రశాంతత ను చేకూరుస్తుంది. అటువంటి దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటైన పంజాగుట్ట లోని దేవాలయం.

హైదరాబాద్ లోని పంజగుట్ట లోని ద్వారకా పురి కాలనీలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ బాబాకు నిత్యం షిర్డీ లో మాదిరిగా నిత్యం సేజ్ హారతి దగ్గర నుండి కాకడ హారతి, మంగళ స్నానం వంటి ఆచారాలు రోజు వారి దినచర్యలు జరుగుతాయి. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.

ఇక్కడ ప్రతి గురువారం పల్లకి సేవ జరుగుతుంది. ఈ సేవ ద్వారకా పురి కాలని నుండి హింది కాలని వరకు జరుగుతుంది. పల్లకి సేవలో అనేక మంది భక్తులు పాల్గొని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామ స్మరణ గావిస్తారు.ఈ దేవాలయం ప్రశంసించదగిన విషయం స్వంత లైబ్రరీ, ధ్యాన మందిరం ద్వారా బాబా జీవితాన్ని మనకు తెలియ చేస్తుంది. అలాగే ఆలయం తరపున లాభాపేక్ష లేని ఆసుపత్రిని నడుపుతున్నారు.

ఆ దేవాలయం కమిటి వారు విభిన్న స్పెషాలిటీస్ కలిగిన అనేకమంది డాక్టర్ల ద్వారా ఉచిత వైద్య కన్సల్టేషన్ అందిస్తున్నారు . దీనికి ఫిజియోథెరపీ సెంటర్, పాథలాజికల్ సెంటర్, ఫ్రీ ఫార్మసీ కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీ రామ నవమి ఘనం గా జరుపుతారు. ఆ రోజున వేలాది మందికి ఉచిత ఆహారం అందించే సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఏది ఏమైనా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా హారతి సమయంలో దర్శించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news