పూరీ జగన్నాథ స్వామి ఆలయ విశిష్టతలు..!

-

ఈశాన్య భారత దేశంలోని ఓడిస్సా రాష్ట్రంలో జగన్నాథ స్వామి ఆలయం ఉంది. దీనినే పూరీ జగన్నాథ స్వామి ఆలయం అంటారు.ఇక్కడ జరిగే రధయాత్ర ప్రపంచ ప్రసిద్ది చెందింది. దీన్ని చూడటం కోసం లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని 1077 వ సంవత్సరంలో నిర్మించారు. గణగణ మోగే గంటలు, 65 అడుగులు ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, కృష్ణుని జీవితం అక్కడి స్తంభాల మీద కళ్ళకు కట్టినట్టు కనపడతాయి.జగన్నాధుడు లోకాలను ఏలే పరమాత్మ అని మన పెద్దలు చెపుతుంటారు. ఆ స్వామి కొలువైన ఈ ఆలయం లో ప్రతిదీ చాల మిస్టరీ గా ఉంటది.

ఈ ఆలయం గురించి నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నాయి.
1.గోపురం మీద ఎగిరే జెండా: సాధారణంగా ఏ గుడిలో అయినా గాలి వాటాన్ని బట్టి జెండా ఎగురుతుంది. కానీ ఇక్కడ మాత్రం గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది.

2. ఈ జగన్నాధ స్వామి ఆలయం చాలా ఎత్తైనది. పూరిలో ఎక్కడి నుండి చూసినా ఈ ఆలయ గోపురం మీద ఉన్న సుదర్శన చక్రాన్ని చూస్తే అది మన వైపే తిరిగుతున్నట్టు అనిపిస్తుంది.

3. పూరి ఆలయంలో ప్రధాన ద్వారం గోపురం నీడ పగలైన, సాయంత్రమైన అసలు కనిపించదు. ఇది దేవుడు అద్భుతమో   లేదా నిర్మాణంలోని గొప్పదనమో తెలియదు.

4.సహజం గా ఏ దేవాలయం మీద అయినా పక్షులు ఎగురుతుంటాయి. కాని ఈ ఆలయం పై మాత్రం అసలు పక్షులు ఎగరవు.

5. ఏ ఆలయంలో అయినా శిలా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం చెక్క విగ్రహాలు వుంటాయి.

6.ప్రతి ఏడాది జరిగే రథ యాత్రలో ఒక ప్రత్యేక విశిష్టత వుంది. రథ యాత్ర ఉరేగింపు అయిపోయి గుడి దగ్గరకు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది.

7. పూరి జగన్నాధ స్వామి కి 65 రకాల ప్రసాదాలు నైవేద్యం పెడతారు. వీటిని మట్టి కుండల్లో నే వండుతారు.మరో విశేషం ఏమిటంటే ఆ నైవేద్యాలు స్వామికి నివేదించక ముందు ఎటువంటి రుచి,సువాసన వుండవు. ఒక సారి స్వామికి నివేదించిన తర్వాత ప్రసాదం ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లుతూ ఎంతో రుచిగా వుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news