కాల బైరవ నాథ్ దేవాలయం విశేషాలు…!

-

మన భారత్ దేశంలోని పురాతన ఆలయాల్లో వారణాసిలోని విశ్వేశ్వర్ గంజ్ లో కాల బైరవ నాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ కాల భైరవ నాధుడిగా మహాశివుడు పూజలు అందుకుంటున్నాడు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువు ఆధిపత్యం కోసం పోటి పడ్డారు. అప్పుడు శివుడు ఆ ఇద్దరి మద్య ఒక శక్తివంతమైన దివ్య కాంతిగా కనిపించాడు. కోపంతో ఉన్న బ్రహ్మ తన అయిదవ తలతో కాంతి వైపు అదేపనిగా చూశాడు.

ఆయన కోపానికి అది కాలిపోతూ ఉంటుంది. అప్పుడు శివుడు కాలభైరవుడుగా మారి బ్రహ్మ యొక్క అయిదవ తలని పీకేస్తాడు. అప్పుడు బ్రహ్మ తల వారణాసిలో పడుతుంది. అయితే బ్రాహ్మణ హత్యా పాతకం పోవడానికి శివుడు అనేక ప్రదేశాలు తిరిగి వారణాసికి రాగానే బ్రాహ్మణ హత్యా పాతకం నుండి విముక్తి పొందుతాడు. అందుకే ఈ ప్రదేశాన్ని కపాల మోచన తీర్థం అంటారు. అప్పుడు శివుడు తన భక్తుల పాపాలు తొలగించటానికి ఎప్పటికి వారణాసిలో కాలభైరవుడిగా ఉంటాను అంటాడు అని భక్తుల నమ్మకం.

దేవతలందరికీ రాజుగా పూజలందుకుంటున్న కాలభైరవుని రూపం భయంకరంగా ఉంటుంది. పుర్రెలు కలిగిన ఒక పూల దండ ధరించి, చేతిలో త్రిశూలం, పక్కన కుక్క కలిగి మృత్యువుకే భయం కలిగేలా ఉంటాడు. భక్తుల యొక్క అన్ని సమస్యలు తీర్చే వాడు కాలభైరవుడు. ఈ ఆలయం క్రి.శ 17 వ శతాబ్దం మద్య కాలంలో నిర్మించారని అంచనా. అక్కడ మద్యాన్ని స్వామికి నైవేద్యం గా సమర్పిస్తారు. విస్కీ లేదా వైన్ ని విగ్రహం నోట్లో పోసి దాన్నే ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఏ దేవుడి గుడి ముందైనా పువ్వులు, కొబ్బరికాయల దుకాణాలు ఉంటాయి. కాని ఇక్కడ మద్యం అమ్మడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news