హైదరాబాద్ లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం జాగ్రత్తలు కాస్త ఎక్కువగానే తీసుకుంటుంది. తెలంగాణాలో దాదాపు 60 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు అన్నీ కూడా విదేశాల నుంచి వచ్చిన వారికి… వారితో సంబంధం ఉన్న వారికి మాత్రమే సోకాయి. దీనితో ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ కరోనాను కట్టడి చెయ్యాలని భావిస్తుంది.
నిన్న ఒక్క రోజే తెలంగాణాలో 10 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అసలు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ కరోనా వైరస్ ఎక్కువగా ప్రబలుతోందో తెలుసుకునే క్రమంలో… ప్రభుత్వం ఐదు ప్రాంతాల్ని గుర్తించి వాటిని రెడ్ జోన్ గా ప్రకటించింది. కోకాపేట, , గచ్చిబౌలి, తుర్కయాంజల్, కొత్తపేట ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో అసలు ప్రజలు ఎవరూ వచ్చే నెల 14 వరకు బయటకు రావొద్దని సూచించింది.
రోడ్ జోన్ ప్రాంతాల్లో నిత్యవసర, అత్యవసర సామాన్లను ప్రభుత్వమే సప్లై చేస్తామని, వాటి కోసం కూడా ఎవరూ బయటకు రావొద్దని కెసిఆర్ సర్కార్ స్పష్టం చేసారు. ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కనీసం ఇంటి ముందు ఉన్న షాపుకు కూడా ఎవరూ వెళ్ళవద్దు అని సూచించారు. ఏది కావాలి అన్నా సరే అధికారులే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి చెప్తే చాలు.