మగవారు వెళ్లకూడదని దేవాలయాలున్నాయి.. మీకు తెలుసా..?

సాధారణంగా కొన్ని దేవాలయాలకి మహిళలకు అనుమతి లేదు అన్న సంగతి మనకు తెలుసు. అయితే మగవాళ్ళు కూడా వెళ్లకూడని ఆలయాలు ఉన్నాయి మీకు తెలుసా..?+అవునండి ఈ ఆలయాలకి మగవాళ్ళకి అనుమతి లేదు. అయితే మరి ఆ ఆలయాలకి సంబంధించి ఎన్నో విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.

Kanyakumari Shakti Peeth

 

ఈ ఆలయంలకి మహిళలు మాత్రమే వెళ్ళాలిట. అయితే పురుషులు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి వాటి వివరాలని చూస్తే.. శక్తి పీఠాల్లో ఒకటిగా నిలిచిన భారత దేశానికి దక్షిణ చివర ప్రాంతంగా ఉన్న కన్యాకుమారి ఆలయం లోకి మగవారు వెళ్ళకూడదు. ఇక్కడకి అస్సలు మగవాళ్ళు వెళ్లకూడదని పురాణాల్లో కూడా ఉంది. ఈ ఆలయంలో భగవతీమాత సన్యాసిగా కొలువైంది. ఇక్కడున్న దేవతని కన్యాకుమారి అని పిలుస్తారు. అందుకనే సన్యాసం పొందిన వారికి మాత్రమే అనుమతి ఉంది.

అదే విధంగా కేరళలోని ఆలయ పూజలోని చెక్కలత్తకువుల్ టెంపుల్ లో దుర్గామాత కొలువై ఉంది ఈ ఆలయంలో నారి పూజలు ఏడు రోజుల పాటు చేస్తారు. అలానే ధను పూజను పది రోజులు చేస్తారు. ఈ పూజల సమయంలో మగవాళ్లు ఆలయానికి వెళ్ళకూడదు.

అలానే రాజస్థాన్లోని పుష్కర్ అనే ఊళ్లో బ్రహ్మ దేవాలయం ఉంది. బ్రహ్మకి ఆలయం ఈ ఒక్క చోటే వుంది. ఈ గుడికి పెళ్ళికాని మగవాళ్ళు వెళ్ళకూడదు. అదేవిధంగా కేరళలోని తిరువనంతపురంలోని ఆర్టికల్ టెంపుల్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ ఆలయానికి మగవాళ్ళు వెళ్ళడానికి అనుమతి లేదు. కేవలం ఆడవాళ్లే ఇక్కడ ఆ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.