కార్తీక మాసంలో తప్పనిసరిగా వీటిని అనుసరించాలి..!

-

కార్తీక మాసంలో పూజలు చేసినా, దీపం వెలిగించినా, నది స్నానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే కార్తీక మాసంలో ఎటువంటి వాటిని అనుసరించకూడదు, ఎటువంటి వాటిని అనుసరిస్తే మంచిది అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.

కార్తీక మాసంలో ఇంగువ, ఉల్లిపాయ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, పుచ్చకాయ, చద్దన్నం, మినుములు, పెసలు, శనగలు, ఉలవలు, కందులు వాడకూడదు. అలానే అష్టమి రోజు కొబ్బరి తినకూడదు. ఆదివారం నాడు అయితే ఉసిరికాయ తినకూడదు. అలానే దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె ఉపయోగించాలి. కానీ మిగిలిన అవసరాలకి నువ్వుల నూనె వాడకూడదు.

కార్తీక మాసంలో నలుగు పెట్టుకుని స్నానం చేయడం కూడా మంచిది కాదు. అలానే కార్తీక మాసంలో దీపారాధన చేస్తే పోయిన జన్మలో కలిగిన పాపాలు కూడా తొలగిపోతాయి. అలానే ఈ జన్మకు పాపాలు కూడా పోతాయి. కార్తీక మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీ దేవికి పూజ చేస్తే చాలా మంచిది.

దీపారాధన సమయం లో పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు, మట్టి కుందులు, వెండి కుందులు ఉపయోగించచ్చు. కార్తీక మాసంలో జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలానే సంపద కలిగి పీడ తొలగిపోతుంది. ఇలా కార్తీకమాసంలో వీటిని అనుసరిస్తే ఖచ్చితంగా మంచి కలుగుతుంది. అలానే ఎంతో పుణ్యం కూడా.

Read more RELATED
Recommended to you

Latest news