తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గం నుంచి కనీసం 100 మందికి దళిత బందు పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎవరూ నమ్మ వద్దు అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో తప్పకుండా దళిత బందు ను అమలు చేసి తీరుతామని ముఖ్య మంత్రి కేసీఆర్ మరో సారి స్పష్టం చేశారు.
లక్ష కోట్లు ఖర్చు చేసినా.. ప్రతి నియోజక వర్గం లో దళిత బందు అమలు చేస్తామని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు. దీనికి రాష్ట్రం లో ఉన్న 119 నియోజక వర్గాల నుంచి ప్రతి నియోజక వర్గం నుంచి 100 చొప్పున 11,900 మంది ని ఎంపిక చేయనున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి రూ. 10,00,000 లక్షల చొప్పున మొత్తం రూ.1190 కోట్లు దళిత బందు కు ఖర్చు చేయనున్నారు. అయితే గతంలో ప్రతి ఒక్క దళితునికి రూ. 10,00,000 తప్పని సరిగా ఇస్తమన్న ముఖ్య మంత్రి.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తం 11,900 మంది కే దళిత బందు అమలు చేయడం ఎమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.