వినాయక చవితి వస్తుందంటే చాలు మనందరి ఇళ్లల్లో సందడి మొదలవుతుంది. గణపతిని ప్రతిష్టించి ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన అనుగ్రహం పొందాలని అందరం కోరుకుంటాం. అయితే పూజ చేసేటప్పుడు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఈ చిన్న పొరపాట్లు పూజాఫలాలను ప్రభావితం చేస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. మరి మనకు తెలియకుండా చేసే ఈ పొరపాట్లు మనం ఎలా సరిదిద్దుకోవాలి. అసలు ఈ పూజలో ఎక్కువగా చేసే తప్పులు ఏమిటి? పూజను సంపూర్ణంగా సరైన పద్ధతిలో నిర్వహించి ఆ గణనాథుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం..
గణపతి పూజలో సాధారణం గా పొరపాట్లు చేస్తుంటాం. గణపతి పూజలో చేసే మొదటి సాధారణ పొరపాటు వినాయకుడి విగ్రహాన్ని ఎంచుకోవడం. మార్కెట్లో ఎన్నో రకాల విగ్రహాలు అందుబాటులోకి వచ్చాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను పూజించడం శ్రేయస్కరం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించడమే కాక శాస్త్రక్తంగా కూడా మంచివి కాదు. మట్టి గణపతిని పూజించడం వల్ల ఆయన్ని పర్యావరణానికి హానిలేకుండా నిమజ్జనం చేయవచ్చు.
రెండో పొరపాటు పత్రి పువ్వుల ఎంపికలో జాగ్రత్త లేకపోవడం. గణపతి పూజలో గణేశుడికి ఇష్టమైన 21 రకాల పత్రి ఆకులను ఉపయోగించాలి. ఈ ఆకులలో ముఖ్యమైనవి మారేడు, జిల్లేడు, గన్నేరు, తులసి మామిడి, రేగు, ఉమ్మెత్త పత్రి. ఇక చాలామంది తులసిని వినాయకుడి పూజలో వాడుతారు కానీ శాస్త్రం ప్రకారం వినాయకుడి తులసి ఆకులతో పూజ చేయడం నిషేధం. తులసిని వినాయకుడి సమర్పిస్తే పూజా ఫలితం లభించదు. అందుకే పత్రి ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి.

మూడో పొరపాటు నివేదన లో జాగ్రత్త లేకపోవడం, వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదుకలు, లడ్లు లాంటివి నైవేద్యం పెట్టడం వల్ల ఆయన త్వరగా ప్రసన్నమవుతారు. అలాగే అరటిపండు, బెల్లం, పాలు నైవేద్యం పెట్టవచ్చు. చాలామంది ప్యాకేజ్ చేసిన ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతారు. ఇది సరైన పద్ధతి కాదు స్వయంగా ఇంట్లో తయారు చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టడం ఉత్తమం.
చివరగా మంత్రాలు, పూజా విధానం సరిగా లేకపోవడం పూజ చేసేటప్పుడు మంత్రాలను తప్పుగా ఉచ్చరించడం పూజా విధానాన్ని సరిగా పాటించకపోవడం వల్ల కూడా పూజ సంపూర్ణం కాదు గణపతి పూజని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఒకవేళ మంత్రాలు తెలియకపోతే గురువుల సహాయం తీసుకోవడం పూజను సరైన పద్ధతిలో చేయడం మంచిది. ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహిస్తే గణపతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.