ప్రపంచంలోనే గణేషుడి భారీ విగ్రహాలు.. చూసొద్దాం రండి

-

గణేష్ అంటే భారతదేశంలోనే అనుకుంటారు. కానీ నిజానికి గణేషుని ప్రపంచంలో పలు దేశాల్లో ఆరాధిస్తారు. ఆయా దేశాల్లో రకరకాల పేర్లతో వినాయకుడిని పూజిస్తారు. అంతేకాదండోయే అతిపెద్ద విగ్రహాలు మనదేశంలో కాదు.. థాయ్‌లాండ్‌లో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. ఆ విశేషాలు తెలుసుకుందాం..

థాయ్‌లాండ్‌లో గణేషుడిని ఫ్రా ఫికానెట్ అని పిలుస్తారు. వినాయకుడిని అదృష్టం, విజయ దేవతగా, అడ్డంకులను తొలగించే దేవుడిగా పూజిస్తారు. అతను కళలు, విద్య, వాణిజ్యంతో సంబంధం కలిగి ఉన్నాడు. ఈ ఏనుగు తలగల హిందూ దేవుడి కోసం పుణ్యక్షేత్రాలు, విగ్రహాలు థాయిలాండ్ చుట్టూ చూడవచ్చు. గణేశుడి అతిపెద్ద విగ్రహాలను కొన్ని చాచోఎంగ్సావో ప్రావిన్స్‌లో ఉన్నాయి. బ్యాంకాక్ పర్యటనలో ఇవన్నీ చూడవచ్చు.పెద్ద కూర్చున్న గణేశాను చాచోఎంగ్సావోలోని వాట్ ఫ్రాంగ్ అకాట్ వద్ద ఉంది. ఇది 49 మీటర్ల ఎత్తు, 19 మీటర్ల వెడల్పుతో ఉంది.

ఈ పెద్ద స్టాండింగ్ గణేశ చాచోఎంగ్సావోలోని ఖ్లాంగ్ ఖుయాన్ గణేష్ అంతర్జాతీయ ఉద్యానవనంలో ఉంది. ఇది 30 మీటర్ల ఎత్తు. ఇది ప్రపంచంలోనే భారీ కాంస్య గణపతి కావడం మరో విశేషం.


ఈ పెద్ద రిక్లైనింగ్ గణేశ చాచోంగ్సావోలోని వాట్ సమన్ రత్తనారాం వద్ద ఉంది. ఇది 16 మీటర్ల ఎత్తు, 22 మీటర్ల పొడవు ఉంటుంది.ఇవండి థాయ్‌లాండ్‌లో గణేషుడి విగ్రహాల సమాచారం. అవకాశం ఉన్నప్పుడు వెళ్లి చూసి వినాయకుడి ఆశీస్సులు పొందండి.

యూరప్‌లో గణపతి తెలుసా?

గణపతి అంటేనే విశ్వపతి. నిజానికి వేదాల్లో చెప్పిన గణపతి శివుడు కుమారుడే కాదు అంతకు ముందే ఉన్నాడు అని ముద్గల, గణేష పురాణాల్లో ఉంది. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలో పలు దేశాల్లో గణపతిని రకరకాల పేర్లతో పూర్వకాలం నుంచి నేటికి ఆరాధిస్తున్నారు అంటే ఆశ్చర్యమే కానీ ఇది నిజం. అలాంటి ఉదంతాలలో ఒకటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూరోపియన్‌లో వినాయకుడి ఆరాధన గురించి విశేషాలను. క్రీ.శ 1672 లో బెర్నార్డ్ పికార్ట్ ప్రచురించిన పుస్తకంలో వివరించారు.

ఏనుగు ముఖంతో ఉన్న దేవుడిని ఇక్సోరా (ఈశ్వర) లేదా శివుడి కుమారుడు క్వెనెవాడిగా చూపించారు. గణపతిని ఏనుగు తలతో మామూలుగా చూపించారు, కానీ 2 పూర్తి దంతాలతో (ఏక దంత అని చెప్పడం ద్వారా వేద మతంలో చిత్రీకరించిన ఒక విరిగిన దంతంగా కాకుండా), తలపై అర్ధ చంద్రుడు (ఇక్సోరా మాదిరిగానే), అతని రెండు చేతుల్లో అసాధారణమైన వంట సామాగ్రితో వినాయకుడిని వర్ణించారు. ఇక మనపక్కనే ఉన్న సిలోన్ అదేనండి నేటి శ్రీలంకలో హెల్త్ & విజ్డమ్ లార్డ్‌గా క్వినేవాడి లేదా గణపతి ఆరాధిస్తున్నారు. ఇక్కడ గణేశుడుని ఆరోగ్యం, వివేకాలకు అధ్యక్షత వహించే దేవుడిగా పూజిస్తారు.
క్వెనెవాడి చింగులైస్ (సింహళీస్) గణపతి

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news