నోయిడా పవర్​ కంపెనీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడా పవర్​ కంపెనీ లిమిటెడ్​లోని(ఎన్​పీసీఎల్​) సెక్టార్​​ 148 సబ్‌స్టేషన్​ వద్ద తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది…తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేస్తున్నారు.భారీ ఎత్తున అగ్ని జ్వాలలు ఎగసిపడటం వల్ల పరిసర ప్రాంతాల్లో పొగ అలుముకుంది. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Noida
Noida

దేశంలోనే నోయిడా పవర్​ కంపెనీ లిమిటెడ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ భారీ సబ్‌స్టేషన్ లు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.సబ్‌స్టేషన్ ను చుట్టుముట్టి మంటలను అదుపులోకి తెచ్చి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదాల లో..ఈ ప్రమాదమే భారీ ఆస్తి నష్టం గురైనట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలిసిన తరువాత సబ్‌స్టేషన్ లో ఉన్న లోటుపాట్లను అధికారులు అంచనా వేస్తారు.