భక్తి: స్త్రీలు నుదుట కుంకుమ ఎందుకు ధరించాలంటే..?

సాధారణంగా ప్రతీ ఒక్క స్త్రీ కూడా నుదుట కుంకుమని ధరిస్తారు. దీని వెనుక కారణం ఏమిటి అనేది చూద్దాం. మన హిందూ ధర్మాల ప్రకారం రకరకాల అంగాలకు, అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా ఉంటారన్న సంగతి తెలిసినదే.

 

అయితే అందులో భాగం గానే లలాటానికి అంటే నుదుటికి బ్రహ్మ దేవుడు అధిపతి. ఆ నుదుట ప్రదేశాన్ని బ్రహ్మ స్థానం అంటారు. బ్రహ్మ కి ఇష్టం అయిన రంగు ఎరుపు. దీని కారణంగా ఎరుపు రంగులో వున్న బొట్టును పెట్టుకోవడం జరుగుతోంది.

ఇది ఒక కారణం అయితే దీనికే మరో కారణం వుంది. అది ఏమిటంటే..? మన నుదుటని సూర్య కిరణాలూ తాకకూడదు. అందుకు నుదుటకు బొట్టు ధరించాల్సి వుంటుంది. అందుకే మహిళలు తమ భర్త జీవితాంతం ఎటువంటి ఆటంకాలు లేకుండా, సుఖంగా వుండాలనే ఆశ తో నుదుటని కుంకుమను ధరించేవారు.

అలానే కుంకుమని ధరించేటప్పుడు ఏ వేలి తో ధరించాలి అనే విషయానికి వస్తే.. ఉంగరపు వేలి తో ధరిస్తే మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అదే నడివేలి తో ధరిస్తే మానవుని ఆయువు సమృద్ధి చెందుతుంది. అదే చూపుడు వేలితో ధరిస్తే చెడు అలవాట్లు అన్నీ సమసిపోయి, భక్తీ కార్యక్రమాల్లో మనసు కేంద్రీకృతమవుతుంది. ​ఒకవేళ బొటన వేలి తో పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి పెరుగుతుంది.