సంక్రాంతి రోజు ముగ్గేసి గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారు?

-

sankranthi gobbemmalu speciality

అవును కదా.. ప్రతి సంక్రాంతికి మనం ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు.. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు చూస్తూనే ఉంటాం. కానీ.. అలా ముగ్గుల మధ్యలో ఎందుకు గొబ్బెమ్మలను పెడుతారనే విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకోలేదు ఇప్పటి వరకు. కానీ.. ఒకటి గుర్తుంచుకోండి. ఎవరైనా ఏ పని చేసినా దాని వెనుక పెద్ద కారణమే ఉంటుంది. అలాగే.. సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలు పెట్టడంలోనూ ఏదో ఒక కారణం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

sankranthi gobbemmalu speciality

సంక్రాంతి.. అంటే ఒక్క రోజు పండుగ కాదు. బోగి, మకర సంక్రాంతి.. ఆ తర్వాతి రోజు కనుమ. ఇలా మూడు రోజుల పాటు జరుగుతుంది సంక్రాంతి. ఈ పండుగ అనగానే గుర్తొచ్చేదేంటి.. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు, రంగు రంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నలు, గొబ్బెమ్మలు గుర్తొస్తాయి కదా.

ఓసారి తెలుగు సంప్రదాయానికి వస్తే.. తెలుగు సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. వాటికి ప్రత్యేకమైన పూజ కూడా ఉందట. గొబ్బెమ్మను విడదీస్తే.. గొబ్బి… అంటే గోపి అని అర్థమట. అది సంస్కృత పదం. గొబ్బెమ్మను నమస్కార దేవత అంటారట. ఇంకా లోతుగా వెళ్లాలంటే… గొబ్బెమ్మను గౌరీ మాతగా కొలుస్తారు. ఇంకొందరైతే.. గొబ్బెమ్మను కాత్యాయినీ దేవిగానూ కొలుస్తారు.

sankranthi gobbemmalu speciality

పండుగ రోజు ముగ్గు వేసి.. ఆ ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి… ఆ గొబ్బెమ్మలను పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. అలా చేస్తే భర్త బతికే ఉన్న పుణ్యస్త్రీతో సమానమట. అందులో పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా పూజిస్తారు. ఆ గొబ్బెమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ.. ఆటపాటలతో సందడి కూడా చేస్తారు.

ముగ్గులు, గొబ్బెమ్మలు లక్ష్మీదేవికి ఇష్టమైనవట. అందుకే.. పండుగ సమయాల్లో ఇలా ముగ్గులు వేసి ఆ ముగ్గులను గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ఇలా చేస్తే సాక్షాత్తూ ఆ దేవతలను తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టే అవుతుందని ప్రజల విశ్వాసం.

Read more RELATED
Recommended to you

Latest news