మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య… ఆతరువాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె సతీమణి సౌభాగ్యమ్మ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. జగన్ సీఎం కావాలని చిన్నాన్న పరితిపించినట్టు ఆమె తన లేఖలో పేర్కొన్నారు.అయితే దోషులను సీఎం జగన్ రక్షిస్తున్నారని దీనిపై తాను ఆవేదన చెందుతున్నానని ఆమె తెలియజేశారు.చిన్నాన్న హత్యకు కారకులైన వారికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్ళపై నిందలు వేస్తూ దాడులు చేసేందుకు కొంతమంది సిద్ధపడుతూ ఉంటే అడ్డుకోవడం లేదని ఆమె సీఎంని ప్రశ్నించారు.సునీతకు సపోర్ట్ చేస్తున్న షర్మిళను కూడా టార్గెట్ చేస్తూంటే స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం కుటుంబ సభ్యుడిగా అయినా స్పందించి న్యాయం చేయాలని ఆమె ఆవేదన చెందారు.
సౌభాగ్యమ్మ లేఖపై వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీ కౌంటర్ లేఖను విడుదల చేశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ మనోవేదనకు గురయ్యారో అసలు మీకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.2010లో జగన్‌ని కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూసినప్పుడు అండగా ఉండాల్సిన మీరు ఒంటిరిని చేసి స్వార్థం చూసుకున్నారని తప్పుబట్టారు.అప్పుడు గుర్తుకు రాని జగన్ ఇప్పుడు స్వార్ధంగా నడుచుకుంటున్నాడని ఎలా అనగలుగుతున్నారని అన్నారు.తండ్రి హత్యలో అమాయకులను ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్న సునీతను ఎందుకు నిలదీయడం లేదన్నారు.ప్రత్యర్థులతో చేతులు కలిపి సొంత అన్నను చులకన చేసి మాట్లాడుతున్న సునీతను తొలుత ప్రశ్నించాలని లేఖలో సూచించారు.ఇప్పటికైనా జగన్ శత్రువుల చేతిలో కీలుబొమ్మగా ఉండకుండా వెంటనే కుంతత్రాలను నుంచి బయటికి వచ్చి తప్పులు తెలుసుకుని న్యాయమైన పోరాటం చేయాలని సూచించారు. అలా అయితే జగన్ తప్పకుండా సహకరిస్తారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
తన చిన్నాన్నను హత్య చేసిన వ్యక్తులు ఎవరో దేవుడికి కడప ప్రజలకు తెలుసని ఇటీవల బహిరంగ సభలో సీఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.అయితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు లేఖల ద్వారా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఈ లేఖలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నామినేషన్‌లు పూర్తయి ఎవరికి వారు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఈ లేఖల గోల ఏంటని అటు కడప ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ గెలుపును అడ్డుకోవడానికి ఎల్లో మీడియా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని చర్చలు జోరందుకున్నాయి.