సోమవారం ఈ స్తోత్రం చదివితే చాలు !

-

సోమవారం..సాక్షాత్తు పరమశివుడికి ఇష్టమైన రోజుగా ప్రతీతి. ఈరోజు శివాభిషేకం, శివపూజ, ధ్యానం చేస్తే సకల పాపాలుపోతాయని భక్తుల నమ్మకం. స్వామి అనుగ్రహం కోసం రకరకాల పూజలు, అభిషేకాలు చేయిస్తుంటారు భక్తులు. కానీ చాలా సందర్భాలలో పూజలు చేయడానికి ఉపవాసం ఉండటానికి కూడా కుదరదు. అలాంటి వారు స్వామిని నిత్యం లేదా కనీసం సోమవారం నాడైనా ఈ కింద చెప్పిన ఆదిశంకరులు రచించిన ఈ స్తోత్రం పారాయణం చేస్తే తప్పక స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్లోకాలు తెలుసుకుందాం…

‘‘రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్
జాతీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గౄహ్యతామ్ ||౧||
సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ||౨||
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||౩||
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాఃశరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్|౪||
కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాఽపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||౫|| ’’
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శివమానసపూజాస్తోత్రం సమాప్తమ్ ||
చిత్తశుద్ధితో శివుడిని పై మానసపూజతో అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news