ప్రతి సోమవారం ఇలా చేయడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయట..

-

పురాణాల ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది..వాటి ప్రకారం మనం చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయని పూర్వికులు చెబుతున్నారు.మన దేశ సాంస్కృతి, సంప్రదాయాల ప్రకారం సోమ వారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు నిష్టగా కొన్ని పనులు చేస్తే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కుటుంబంలో ఏదైనా కలహాలు ఉంటే వాటి నుంచి విముక్తి కలుగుతుందని అంటున్నారు. అసలు సోమవారం ఎలాంటి పనులు చెయ్యాలి, ఎలాంటి పనులు చెయ్యకూడదు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఆది దేవుడు శివుడిని సోమవారం నాడు కొలుస్తారు భక్తులు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేయడం ద్వారా పరమేశ్వరుడి ఆశీర్వాదాలు పొందుతారు.. కుదిరితే సోమవారం తెల్లవారుజామున స్నానం చేసిన తరువాత శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని ప్రార్థించండి. ఇంట్లో శివుడి విగ్రహం, ఫోటోకు పూజ చేయండి. సోమవారం నాడు ఉపవాసం ఉండటంతో పాటు, నలుగురికి వస్త్రాలు, అన్నదానం వంటివి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు.

ప్రతి సోమవారం ఉపవాసం,
సోమ ప్రదోష వ్రత పూజ,
16 రోజుల సోమవారం వ్రత పూజలు నిష్టగా చేయడం వల్ల మంచి జరుగుతుంది.

సోమవారం అసలు చెయ్య కూడని పనులు..

రాగి గిన్నె, లేదా గ్లాసులో పాలను పోసి శివుడికి అభిషేకం చేయకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం స్వామి వారికి అయిష్టమట.
శివలింగంపై చందనం వేసి అభిషేకించండి. అయితే, దానిపై కుంకుమ, పసుపు వేయొద్దు.

కాగా, సోమవారం వ్రతం చేసేవాల్లు తెల్లని వస్త్రాలను అస్సలు దానం ఇవ్వకండి..పూజ చేసే వ్యక్తి కుంకుమ, పసుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించవచ్చు.
సోమవారం ఉపవాస పూజలో నల్లని వస్త్రాలు ఉపయోగించవద్దు..సో

సోమవారం ఉత్తర,తూర్పు దిశగా ఎదురెళ్ళి ప్రయాణం చెయ్యకూడదు..

Read more RELATED
Recommended to you

Latest news