వాస్తు టిప్‌.. ఈ దిశగా మీ ఇంటి గార్డెన్‌ ఏర్పాటు చేసుకోండి!

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి గార్డెన్‌ను ఈ దిశగా పెట్టుకుంటే సంపద కలుగుతుంది. సా«ధారణంగా గార్డెన్‌లో కుండీల్లో మనం మొక్కల్ని పెంచకుంటాం. అయితే ఏ దిశగా ఏర్పాటు చేసుకుంటే మీ లాభం చేకూరుతుందో తెలుసుకుందాం.


వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి అంటేనే భూమికి సంబంధించినది. అవును వాస్తు ప్రకారం నైరుతి దిశలో మట్టికి సంబంధించిన వస్తువులను పెడతాం. ఇంటికి పెయింట్‌ వేసుకున్నప్పుడు కూడా ఈ దిశగా మట్టి కలర్‌ను వేసుకోవాలి అంటారు. అదేవిధంగా నైరుతి దిశలో గచ్చు వేసుకున్న ఎరుపు రంగు టైల్‌ను వేసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచనలు మనకు తెలుసు. అందుకే మట్టి వస్తువులను కూడా ఈ దిశలో పెట్టుకోమని సూచిస్తున్నారు. గార్డెనింగ్‌ అంటే మొత్తం మట్టితో కూడుకున్నద నుక నైరుతి దిశలో గార్డెనింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఆగ్నేయంలో కూడా ఇటువంటి గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిశ కూడా మీకు శుభం కలుగజేస్తుంది. ఈ రెండు దిశల్లో మట్టికి సంబంధించిన భారీ వస్తువులను పెట్టుకుంటే లాభం కలుగుతుంది. అంటే ఈ దిశల్లో భారీ కుండీల్లో మొక్కల్ని పెట్టుకుని గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ఒకవేళ చిన్న కుండీలతో గార్డెనింగ్‌ పెట్టుకోవాలనుకుంటే ఈశాన్యం దిశలో పెట్టుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మీకు చాలా లబ్ధి చేకూరుతుందట. ఇలా దిక్కుల్ని పాటిస్తూ ఏర్పాట్లు చేసుకుంటే, ఎటువంటి నష్టాలు రావు.