“ఉడుతా భక్తి” శ్రీరామ ఉడుతా భక్తి కథ..

-

రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్ళిన తరువాత, రావణాసురుడి నుండి తన భార్యయైన సీతాదేవిని రక్షించుకోవడాన్కి యుద్ధం చేయాల్సిన సందర్భంలో శ్రీరాముడు సముద్రాన్ని దాటవలసివచ్చింది. హనుమంతుడు, సుగ్రీవుడు మొదలగు వానరసైన్యం లంక దాకా సముద్రంపై వంతెన కట్టడానికి సిద్ధమైంది. నలుడు వానర సైన్యానికి నాయకుడిగా వుండి అనేక లక్షల మంది వానరుల సహాయంతో పెద్దపెద్ద రాళ్లని పెళ్లగించి తెచ్చి సముద్రంపై వారధి నిర్మిస్తూ ఉంటారు.

 

ఆ సమయంలో ఆ సమీపంలో వుండి యిదంతా చూస్తున్న ఒక ఉడుత శ్రీరామునియెడల భక్తితో తను కూడా చేతనైనంత సహాయం చేయాలనుకుని సముద్రం నీటితో తన తోకను తడుపుకుని సముద్రపు ఇసుకలో పొర్లి వానరులు నిర్మిస్తున్న వారధిపై తన తోకను దులుపుతూ సాయం చేసింది. ఇది గమనించిన శ్రీ రాముడు ఆ ఉడుత భక్తి శ్రద్ధలకు ఎంతో ఆనందం చెంది చేతులలోకి తీసుకుని దాని వీపుపై మూడు వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడట. దాంతో ఉడుత వీపుపై మూడు చారలు ఏర్పడ్డాయని చెబుతారు. ఈ కథ ఆథారంగా “ఉడుతా భక్తి” అనే మాట వాడుకలోకి వచ్చిందంటారు.ఎవరికి చేతనైన రీతిలో వారు తమ భక్తి శ్రద్ధలను ప్రకటించుకోవడంలో తప్పు లేదని,దానిలో నిజాయితీ,చిత్తశుద్ధి మాత్రమే వుండాలని తెలియజేసేందుకు ఈ సామెతను వాడుతున్నారు. .. అంటే చేసే కొద్ది సాయమైనా మనస్ఫూర్తిగా చేయాలని ఇక్కడ ఉద్దేశ్యం.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news