ఇండ్లలో మనీప్లాంట్‌ను పెట్టుకుంటే దాంతో ధనం బాగా సంపాదించవచ్చని, ఆర్థిక సమస్యలు పోతాయని చాలా మంది భావిస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది నిజమే అయినప్పటికీ.. మనీ ప్లాంట్‌ను ఇండ్లలో ఎలా పడితే అలా పెట్టరాదు. ఆ ప్లాంట్ ను పెట్టుకునేందుకు కూడా పలు నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను పాటిస్తూనే ప్లాంట్‌ను ఇంట్లో పెంచాలి. లేదంటే నెగిటివ్ ఫలితాలు వస్తాయి. మరి మనీ ప్లాంట్‌ను ఇండ్లలో పెంచేందుకు ఏయే నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మనీ ప్లాంట్ మొక్క ఆకులు ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోవాలి. ఆకులు ఎండిపోయి అలాగే ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక ఆకులను ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. నిత్యం మొక్కకు నీరు పోయాలి.
2. ఇంట్లో ఈశాన్య మూలలో మనీ ప్లాంట్‌ను ఉంచరాదు. ఉంచితే ఆర్థిక సమస్యలు వస్తాయి.
3. మనీ ప్లాంట్ మొక్క ఆకులను కత్తిరించాల్సి వస్తే కింద పడకుండా చూసుకోవాలి. కింద పడితే సమస్యలు ప్రారంభమవుతాయి.
4. ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ మూలలోనే పెంచాలి. ఎందుకంటే ఆ దిక్కుకు అధిపతి విఘ్నేశ్వరుడు. కనుక ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
5. ఇంట్లో తూర్పు లేదా పడమర దిశల్లో మనీ ప్లాంట్‌ను అస్సలు పెంచరాదు. పెంచితే దాంపత్య కలహాలు వస్తాయట.
6. మనీ ప్లాంట్ ను ఎల్లప్పుడూ ఇంటి లోపలే పెంచాలి. ఇంటి బయట కాదు. ఒక వేళ బయట ఈ మొక్కను పెంచాల్సి వస్తే.. దానిపై సూర్యరశ్మి పడకుండా పైన కవర్ ఉంచాలి.
7. మనీ ప్లాంట్ ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యులు అంత ఎక్కువగా ధనం సంపాదిస్తారట.
8. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకోవడం వల్ల కేవలం ఆర్థిక సమస్యలు పోవడం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, ఇది ఇంట్లోని కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా ఉంచుతుందుని వాస్తు శాస్త్రం చెబుతోంది.
9. మనీ ప్లాంట్ ఆకులు లవ్ (హార్ట్) షేప్‌లో ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయట.
10. మనీ ప్లాంట్ ఆకులను కత్తిరిస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులే కత్తిరించాలి. బయట సభ్యులు కట్ చేయరాదు. అలాగే ప్లాంట్ పెరుగుతున్న కొద్దీ కుండీ సైజ్‌ను కూడా పెంచాలి.