వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. వీటిని కనుక పాటించారంటే కచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. అలానే సమస్యలన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి.

 

sleep

పైగా కుబేరుడి అనుగ్రహం కూడా ఇలా పొందొచ్చు అని పండితులు చెప్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం. అయితే ఇంట్లో ఆనందం ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా… ప్రతి ఒక్కరూ కలిసి ఐకమత్యంగా, ప్రేమగా ఉండాలన్నా ఈ విధంగా ఉండమని పండితులు చెబుతున్నారు. పైగా ఇలా చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం కూడా పొందవచ్చు.

ప్రతి రోజు రాత్రి నిద్ర పోయేటప్పుడు లేవగానే ముఖం ఈశాన్యం వైపు ఉండేటట్టు నిద్ర పొమ్మని… ఇలా చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెప్పారు. దీని వల్ల మంచి కలుగుతుందని చెబుతున్నారు పండితులు. ఎప్పుడూ కూడా మీరు లేచేటప్పుడు మీ ముఖం దక్షిణ దిశగా ఉండకూడదని ఇలా ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ కనుక మీరు విజేతగా నిలవలేక పోతున్నా, ఓటమి పదేపదే వస్తున్నా ప్రతి రోజూ త్వరగా లేచి స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు వేసి సూర్యనారాయణ స్వామికి అర్పించండి. ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. దీనితో మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు ఇబ్బందులు కూడా ఉండవు.