గుండె ఆరోగ్యం నుండి షుగర్ లెవెల్స్ వరకు జీడిపప్పుతో ఎన్నో లాభాలు..!

-

జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఏ వంటకాలలో జీడిపప్పు వేసినా ఆ వంట రుచి రెట్టింపు అవుతుంది. అలానే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో అనారోగ్య సమస్యలు జీడిపప్పుతో తరిమికొట్టొచ్చు. అయితే మనం జీడీ పప్పు వల్ల కలిగే లాభాలు గురించి ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం.

cashew

 

బరువు తగ్గొచ్చు:

నట్స్ లో ప్రొటీన్లు, ఫైబర్, ఫ్యాట్ ఉంటాయి. అయితే వీటిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. సాధారణంగా బాదం, పల్లీలు వాల్ నట్స్ లో కంటే కూడా జీడిపప్పులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

కొలెస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది:

సాధారణంగా రెండు రకాల కొలస్టార్ల్స్ ఉంటాయి. ఎల్డీఎల్ మరియు హెచ్డిఎల్. ఎల్డిఎల్ అనేది హానికరమైనది. అది కవాటం కి కొవ్వుని తీసుకువెళుతుంది. హెచ్డిఎల్ గుండెకి మేలు చేస్తుంది అయితే జీడిపప్పు తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

హృదయ ఆరోగ్యానికి మంచిది:

జీడిపప్పు తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. జీడిపప్పు లో మోనో అన్ సాచ్యురేటెడ్ మరియు పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గించడంకి బాగా ఉపయోగపడుతుంది.

సెల్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది:

గింజలు మరియు నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తాయి అలానే సెల్స్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటాయి.

బ్లడ్ షుగర్ లెవల్స్ :

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది గ్లూకోస్ ని క్రమంగా తగ్గించి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news