ఆర్థిక సమస్యలు పోవాలంటే పూజ గదిలో వీటిని పెట్టుకోండి…!

చాలా మంది ఆర్థిక సమస్యల తో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ మార్పులు చేయడం వల్ల మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని కనుక పూజ గది లో ఉంచితే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివిటీ ఉంటుందని పండితులు చెప్పడం జరిగింది. తద్వారా ఆర్థిక సమస్యలు కూడా పోతాయి అని అన్నారు.

నెమలి పింఛము:

పూజ గదిలో నెమలి పించంని పెట్టడం వల్ల మంచి కలుగుతుందని పండితులు అంటున్నారు. నెమలి పించం పాజిటివ్ ఇస్తుందని శ్రీకృష్ణుడికి కూడా ఇవి చాలా ఇష్టమని వీటిని ఉంచడం వల్ల మంచి కలుగుతుందని చెప్పడం జరిగింది.

శంఖం:

పూజ గదిలో శంఖాన్ని పెట్టడం వల్ల కూడా మంచి కలుగుతుందని పండితులు చెప్పడం జరిగింది. శంఖం శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మీ పూజ గదిలో దానిని పెట్టడం మంచిది.

శ్రీ యంత్రం:

శ్రీ చక్రాన్ని మీ ఇంట్లో పెట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయని డబ్బులు ఉంటాయని పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి పూజ గదిలో ఒక శ్రీచక్రాన్ని పెట్టండి దీనితో మంచి లాభాలు ఉంటాయి.

సాలిగ్రామాలు:

సాలిగ్రామం విష్ణు రూపంగా భావిస్తారు. సాలగ్రామాన్ని పూజ గదిలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు రావని పండితులు చెప్పారు. కాబట్టి ఈ విధంగా మీరు అనుసరిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.