వాస్తు: డైనింగ్ రూమ్ లో ఈ మార్పులు చేస్తే సమస్యలే వుండవు..!

వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయితే ఎటువంటి సమస్య లేకుండా ఆనందంగా ఉండొచ్చు. చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వాటి నుండి బయట పడాలంటే కచ్చితంగా వాస్తు ని పాటించండి. ఇలా మీరు వాస్తుని ఫాలో అయ్యారంటే ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అయితే మరి ఎటువంటి ఆలస్యం చేయకుండా పండితులు చెబుతున్న వాస్తు చిట్కాలని చూసేద్దాం.

మన ఇంట్లో ప్రతి గదికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వంట గది, బెడ్ రూమ్ ఇలా రూమ్ కి తగ్గట్టుగా మనం వాస్తుని ఫాలో అవ్వాలి. అయితే డైనింగ్ రూమ్ లో కూడా వాస్తు చిట్కాలను పాటించాలి. అయితే మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. డైనింగ్ రూమ్ లో పెయింట్స్ గురించి పండితులు చెప్పడం జరిగింది. డైనింగ్ రూమ్ లో సాధారణంగా మనం కంఫర్టబుల్ గా కూర్చుని మాట్లాడుకుంటూ తింటూ ఉంటాం.

నిజంగా ఇలా అందరూ కలిసి కూర్చోవడం చాలా ముఖ్యం. అయితే డైనింగ్ రూమ్ లో మనం రంగులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రంగులు వేస్తే చాలా మంచిదని దీని వల్ల ఏ సమస్య ఉండదని పండితులు చెబుతున్నారు. అయితే ఆ రంగులు గురించి చూస్తే… డైనింగ్ రూమ్ లో పింక్, పసుపు, క్రీమ్, లైట్ బ్రౌన్, లైట్ బ్లూ రంగులు వేసుకుంటే చాలా మంచి. దీని వల్ల ఏ సమస్య ఉండదు పైగా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి పండితులు చెబుతున్న ఈ విధంగా మీరు పాటించి సమస్యల నుండి బయటపడండి.