మీ చేత్తో ఈ వస్తువులను ఎప్పటికీ ఇవ్వకండి.. ఆర్థికంగా దెబ్బతింటారట

-

ఆచారాలు ఎక్కువగా పాటిస్తే చేదస్తం అంటారు. అలా అనే చాలా మంది వాటని పట్టించుకోరు. సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ లేకుండా ఎవరూ ఉండరూ కదా..! ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లో అయినా కొన్ని సెంటిమెంట్స్‌ను, అక్కడి ఆచారాలను జనాలు పాటిస్తుంటారు. మన దగ్గర కూడా పండితులు చాలా చెప్తుంటారు. మీరు మీ చేత్తో ఇతరులకు ఇవ్వకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదట. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాంటివి ఏంటో చూద్దామా..!

మిరపకాయలు

ఏ వ్యక్తి చేతికి నేరుగా కారం ఇవ్వకూడదు. ఎవరైనా ఇలా చేస్తే ఆ వ్యక్తితోనే గొడవలు మొదలవుతాయని పండితులు అంటున్నారు. అందుకే కారం, మిరపకాయలు లాంటివి ఎప్పుడూ ఒకరి చేతికి అందించకూడదు.

ఉప్పు

ఉప్పు లక్ష్మీ స్వరూపం అని చెబుతారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటూ ఉప్పు కూడా ఉద్భవించింది. అందుకే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు ఉప్పుతో చాలా రెమిడీస్ చెబుతారు. ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఒక గాజు పాత్రలో పిడికెడు ఉప్పు వేసి అందులో నాలుగైదు లవంగాలు కూర్చి ఇంట్లో ఈశాన్యం మూలన ఉంచాలంటారు. ప్రతి శుక్రవారం ఉప్పుతో దీపం వెలిగిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో ఉప్పువేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పురాణాల ప్రకారం ఐశ్వర్యం పెరగాలన్నా, శని ప్రభావం తగ్గాలన్నా ఉప్పే పరిష్కారం. అందుకే ఉప్పును చేతికి ఇవ్వకూడదని చెబుతారు పండితులు. అలాగే ఎవరి ప్లేట్‌లో ఉప్పు వేయకూడదట.. చాలా మంది వడ్డించేప్పుడు పెరుగుతో పాటు ఉప్పు కూడా వేస్తుంటారు. అలా చేయకూడదు.

కశ్చీఫ్

ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కశ్చీఫ్ కావాలని అడగ్గానే ఠక్కున తీసి చేతికందిస్తారు. కానీ రుమాలు ఎప్పుడూ చేతికి అందించకూడదంటారు పండితులు. ఇవ్వాలి అనుకుంటే అక్కడ పెట్టి తీసుకోమని చెప్పండి కానీ నేరుగా చేతికి ఇవ్వొద్దంటారు. అలా కశ్చీఫ్ చేతికిస్తే మాత్రం ఆర్థికంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు పండితులు.

రొట్టెలు

సాధారణంగా రొట్టెలు తినేటప్పుడు పక్కవాళ్లు కావాలని అడగ్గానే చాలామంది ప్లేట్లో వడ్డిస్తారు. కొందరు మాత్రం రొట్టే కదా అంటుకోదు కదా అని చేతికి అందిస్తారు. కానీ రొట్టెలు ఎప్పుడూ ప్లేట్లో వడ్డించాలి కానీ చేతికి ఇవ్వకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news