ఇంటి ముందు ఇవి ఉంటే.. వెంటనే తొలగించండి!

-

సాధారణంగా అందరూ ఇంటి నిర్మాణాన్ని వాస్తు ప్రకారమే కట్టుకుంటారు. కిచెన్, వాష్‌రూం, హాలు, పూజగదిని వాస్తుకు అనుకూలంగా నిర్మిస్తాం. ఇంటి పెయింటింగ్, గచ్చు రంగుకు కూడా ప్రాధాన్యతనిస్తాం. అలాగే, ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువులకు కూడా ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఉండే వస్తువులను పెట్టుకుంటాం. ఎందుకంటే ఇటువంటి వస్తువులతో ఇంట్లోకి నెగెటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అయితే, ఇంటి బయట ప్రాంతానికి కూడా వాస్తు ప్రాధాన్యత ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

 

మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదుట స్తంభం, చెట్టు లేదా గొయ్యి ఉంటే అవి ఇంటికి అశుభాన్ని తీసుకువస్తాయి. మంచిది కాదు. దీనివల్ల ఆ ఇంట్లో ఉండే వారు ఏ కారణం లేకుండానే సమస్యలు వస్తాయి. సాధారణంగా ఇంటి ప్రధాన ద్వారం గుండానే పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ ఎన ర్జీ ప్రవేశిస్తుంది. అటువంటి ప్రధాన ద్వారానికి ఎవైనా అడ్డంగా లేదా విఘ్నాలు కలిగించేవి ఉంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులకు కీడు కలిగిస్తుంది.

అయితే, ఇవి ఉంటే కొన్ని పరిస్థితుల్లో వాటిని తొలగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు కొన్ని వాస్తు నియమాల ప్రకారం పాటిస్తే వాటి నుంచి వచ్చే విఘ్నాల నుంచి బయట పడవచ్చు. మన పురాణాల ప్రకారం స్వస్తీక్‌ గుర్తు శుభానికి సూచకం. ఈ గుర్తు ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఈ స్వస్తీక్‌ గుర్తును పెట్టాలి. అదేవిధంగా ఇంటి ముందు ఉన్న గుంతను వెంటనే పూడ్చేయాలి. దీని వల్ల ఇంటికి ఎటువంటి అడ్డంకులు కలగవు.

Read more RELATED
Recommended to you

Latest news