వాస్తు : పూజ మందిరంలో విరిగిపోయిన విగ్రహాల వలన నష్టం కలుగుతుంది..!

-

భగవంతుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్న విషయం అందరికి తెలిసిందే. నిజంగా ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ, ప్రశాంతత వంటివి ఉంటాయి. అయితే అన్ని గదులు పై శ్రద్ధ ఎలా పెడతారో దేవుడి గది పై కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టాలి.

వాస్తు | Vasthu
వాస్తు | Vasthu

పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవడం, పూజ గదిని ప్రశాంతంగా ఉంచుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అయితే కొంత మంది తెలియక కొన్ని తప్పులు చేస్తారని.. సరి చేసుకోకపోతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం మనము ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

కొందరి ఇంట్లో తెలియక ఈ తప్పులు చేస్తూ ఉంటారు. పూజ గదిలో పగిలిపోయిన లేదా విరిగిపోయిన దేవుడి విగ్రహాలను ఉంచుతారు. అయితే వీటిని ఉంచడం అసలు మంచిది కాదని దీని వల్ల నెగటివ్ ఎనర్జీ ఉంటుందని పండితులు చెబుతున్నారు. విరిగిపోయిన లేదా పగిలిపోయిన దేవుడి విగ్రహాలను ఉంచుకోకూడదు అని చెబుతున్నారు.

వీటిని పవిత్రమైన నదిలో కానీ చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ వదిలేస్తే మంచిదని అన్నారు ఒకవేళ కనుక అవి విరిగి పోయినా లేదా పగిలిపోయిన దేవుడి విగ్రహాలను ఉంచితే వాస్తు దోషాలు ఉంటాయని నెగిటివిటీ వస్తుందని అంటున్నారు.

అదే విధంగా పగిలిపోయిన దీపాలను కూడా ఉంచకూడదని దీని వల్ల ధననష్టం, ఆర్ధిక సమస్యలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కనుక ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడండి దీంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news