వాస్తు: పిల్లల్లో జ్ఞాపకశక్తిని ఇలా పెంచండి..!

-

పండితులు వాస్తు చిట్కాలని చెప్పారు. వాటిని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అయితే మరి పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి తెలుసుకుందాం. వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా మార్పు మీరే గమనిస్తారు. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల యొక్క స్టడీ రూమ్ గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే నిజానికి తల్లిదండ్రులు ఈ మార్పులు చేస్తే పిల్లలు యొక్క జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

 

vasthu

అలాగే వారి యొక్క మెదడు పనితీరు కూడా బాగుంటుంది. మరి ఇంక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ టిప్స్ గురించి చూసేద్దాం. పిల్లలు చదువుకునే గదిలో ఎప్పుడు కూడా లైట్ కలర్ రంగులు వేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎప్పుడూ కూడా స్టడీ రూమ్ చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండాలి. ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి.

రంగులు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కనుక పిల్లల గది లో రంగులు వేసేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. స్టడీ రూమ్ లో రంగుల విషయానికి వస్తే… క్రీమ్ కలర్, లైట్ పర్పల్, లైట్ ఆకుపచ్చ, స్కై బ్లూ, పసుపు బ్రౌన్ కలర్ చాలా మంచిదని పండితులు చెప్పడం జరిగింది. లైట్ కలర్స్ వేయడం చాలా మంచిదని… దీనివల్ల వాళ్ళల్లో స్టెబిలిటీ పెరుగుతుందని అలానే బాగా చదవగలరు అని తెలుస్తోంది. ముఖ్యంగా పసుపు రంగు పిల్లలు యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది కనుక ఈ మార్పులు చేసి మీ పిల్లల యొక్క జ్ఞాపకశక్తిని మరింత మెరుగు పరచండి.

Read more RELATED
Recommended to you

Latest news