వాస్తు టిప్స్: ఈశాన్యంలో చీపురు, చెత్తబుట్ట ఉంచుతున్నారా? ఐతే ఇది తెలుసుకోండి.

వాస్తు శాస్త్రంలో మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు తెలియవు కాబట్టి వాటి జోలికి వెళ్ళము. కొన్ని విషయాలు తెలిసినా వాటిని పాటించడం, పట్టించుకోవడం కష్టం అని చెప్పి వదిలేస్తాము. అలా వదిలేయడం వారి వారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని కొన్నిసార్లు వాస్తు పాటించకపోవడం వల్లే ఇలా జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తుతాయి. అంతా సాధారణంగా ఉన్నప్పుడు ఏమీ ఉండదు. కానీ కొద్దిగా ఏదైనా తేడా జరిగినపుడే ఇది చర్చకు వస్తుంది.

అప్పుడు మనసులోకి వచ్చిన అనుమానం పెనుభూతంగా మారి మెదడుని తినేస్తుంది. అలాంటి టైమ్ లో నచ్చిన పనులు చేస్తుంటాం. అప్పటి వరకు ఇల్లంతా ఎలా కావాలంటే అలా ఉండేది, అప్పటి నుండి ఒక పద్దతిలో మారుస్తారు. అలా మార్చేటపుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఇల్లంతా మారుస్తున్నారు కదా ఆ టైమ్ లో చెత్తబుట్ట, చీపురుకట్ట ఎక్కడ ఉంచాలనే సందేహం వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు విషయాలను ఈశాన్యంలో ఉంచకపోవడం ఉత్తమం.

చీపురుకట్ట, చెత్తబుట్టని ఈశాన్యంలో ఉంచకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దానివల్ల రావాల్సిన అవకాశాలు తగ్గిపోతాయని, ఏదైనా చేయాలనుకున్న పనికి అడ్డంకులు వస్తాయని అంటున్నారు. ఈశాన్యంలో చీపురు కట్ట, చెత్త బుట్ట ఉన్నట్లుగా మీరు భావిస్తే, వాస్తుశాస్త్రాన్ని మీరు నమ్ముతున్నట్లయితే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపించాలి. ఆ ప్రశాంతత దూరం కావడానికి వాస్తు శాస్త్రంలోని కొన్నింటిని పాటించకపోవడమే అని మీరనుకునుంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.