మహా విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు హీరో కల్యాణ్‌రామ్. అయితే ఈ పోస్టర్ కొత్తగా ఉంది. బింబసారా అనే టైటిల్లో రాజు గెటప్‌లో శత్రువులను చంపుతున్న కల్యాణ్‌రామ్ పోస్టర్ సూపర్ అనిపిస్తోంది. పీడియాట్రిక్ డ్రామాలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కల్యాణ్ రామ్ ఇలాంటి పాత్రలు చేయడం ఇదే మొదటిసారి.
అయితే ఈ టైటిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బింబసారా అంటే ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. బింబసారా అంటే అది ఒక రాజుపేరు. బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. ఆయనది హర్యాంక వంశంగా పేరుంది.
మగధ రాజ్యాన్ని బింబసారుడు క్రీస్తు పూర్వం 543 నుంచి 492 మధ్య పాలించారు. భట్టియా అనే అధిపతికి బింబసారుడు ఏకైక కుమారుడు. మొదట రాజగిరిని, ఆ తర్వాత పాటలీపుత్ర (పాట్నా) ను రాజధానిగా చేసుకొని పాలించారు. బిహార్, గంగానది దక్షిణ ప్రాంతాల్లో మగధ సామ్రాజ్యం విస్తరించి ఉండేది. ఈ రాజు పాత్రనే ఇప్పుడు కల్యాణ్ రామ్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్‌కు జోడీగా కేథరిన్ నటిస్తోంది. వశిష్ట్ డైరెక్టర్.