కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది సతమతమవుతున్నారు. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం తో పాటు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవడం ముఖ్యం. గ్రామాల్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రభుత్వం తాజాగా సరి కొత్త నిర్ణయం తీసుకుంది.
నేషనల్ హెల్త్ అధారిటీ హెడ్ ఆర్ శర్మ శుక్రవారం నాడు దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. అయితే గ్రామాల్లో ఉండే వాళ్లు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇప్పుడు కష్టపడక్కర్లేదు అని సులువుగా వ్యాక్సిన్స్ స్లాట్ బుక్ చేసుకో వచ్చని అన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
దీని కోసం 1075 హెల్ప్ లైన్ నెంబర్ కి డయల్ చేసి ఈజీగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ ఈ హెల్ప్ లైన్ నెంబర్ ని ఉపయోగించాలని ఎవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు.
గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని.. ఇలా సులువుగా ఈ పద్ధతిని పాటించవచ్చు అని అన్నారు. అయితే 45 ఏళ్లు దాటిన వాళ్ళు డైరెక్టుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వరకు వయసు ఉన్న వాళ్ళు వాక్సిన్ వేయించుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని సప్లై కాస్త తక్కువగా ఉందని చెప్పారు.