ఈ దిశగా క్యాండిల్‌ను వెలిగిస్తే .. నెగెటివ్‌ ఎనర్జీ ఇట్టే పోతుంది!

ఈరోజు మనం ఇంటికి వెలుగునిచ్చే క్యాండిళ్ల గురించి తెలుసుకందాం. మార్కెట్లో రకరకాల క్యాండిల్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. వివిధ సువాసనలతో దొరుకుతున్నాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటికి వీటి అవసరం చాలా ఉంటుందట. అవును మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరిగి ఇంటి అభివృద్ధికి ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. వివిధ రకాలు రంగులతో ఉండే క్యాండిళ్లు మీ ఇంటికి వెలుగునిచ్చి, చీకటిని తరమడమే కాకుండా నెగెటివ్‌ ఎనర్జీని సైతం తరిమేస్తుంది. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా మారుతుంది.

 

క్యాండిళ్లను ప్రత్యేకంగా వాటిని ఇష్టం వచ్చిన వైపు, ఖాళీగా మీకు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో కాకుండా, వాటి వెలుగుతో మన ఇంటిలో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీని చీల్చి చండాడే గుణం వచ్చే దిశలో మాత్రమే పెట్టాలి. మన ఇంట్లో ఇలా క్యాండిల్‌ను వెలిగించడం వల్ల నెగెటివ్‌ ఎనర్జీని తొలగించి పాజిటివ్‌ ఎనర్జీ వ్యాపింపజేస్తూ ఇంటిని బ్యాలెన్స్‌ చేసే గుణం క్యాండిల్‌కు ఉంది. కానీ, వీటిని అనుకూలమైన ప్రత్యేక ప్రదేశంలోనే పెట్టాలి. క్యాండిళ్లను ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఈశాన్యం దిశలో పెడితే ఆ ఇంట్లో సుఖసంతోషాలకు కొదవుండదు.