వాస్తు టిప్‌: మీ వాహనాన్ని ఈ దిశలో పార్క్‌ చేయండి!

-

ఈ రోజుల్లో ప్రతిఒక్కరికీ వాహనం ఉండటం సహజం. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినపుడు ట్రాన్స్‌పోర్ట్‌ పూర్తిగా బంద్‌ అయినపుడు చాలా మంది సొంత వాహనాలను కొనుగోళు చేశారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ఆవరణలో వాహనాన్ని ఎటువైపు పార్కింగ్‌ చేయాలి? అదే విధంగా కార్‌ పార్కింగ్‌ కోసం నిర్మించే షెడ్డును ఏ దిశలో నిర్మించాలనే నియమాలు ఉన్నాయి.

మీ వాహనాన్ని కచ్చితంగా వాస్తు ప్రకారం పార్కింగ్‌ చేయడమే మేలు. ఇది చాలా ముఖ్యం. నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిదానికి ఒక ముఖ్యమైన దిశ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వాహన పార్కింగ్‌ ఏ దిశగా ఉండాలి తెలుసుకుందాం. మీ ఇంటి ఆవరణలో పార్కింగ్‌ గ్యారేజ్‌ను నిర్మించాలనుకుంటే ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలో నిర్మించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రెండు దిశలు షెడ్డు నిర్మాణానికి అనువైన దిశలు. కార్‌ పార్కింగ్‌కు వాయువ్యం దిశగా నిలపాలి. అంటే మీరు ఏదైనా వాహనాన్ని పార్క్‌ చేసేటపుడు దాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశగా పార్కింగ్‌ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news