వాస్తు: ఆర్ధిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

ఈరోజు వాస్తు ( Vasthu Tips ) పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను మనతో పంచుకున్నారు. వీటిని కనుక అనుసరిస్తే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈజీగా తొలగిపోతాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

 

వాస్తు | Vasthu Tips
money-plant

సాధారణంగా కొందరు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పండితులు చెప్పిన ఈ ఉపాయాన్ని పాటిస్తే ఆర్థిక సమస్యలు పోతాయి. చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ని నాటుతారు. నిజంగా ఇంట్లో ఉండటం వల్ల సమస్యలని అది పోగొడుతుంది.

ఎప్పుడైనా మనీ ప్లాంట్ ని ఇంట్లో పెట్టాలి అంటే తూర్పు లేదా పడమర వైపు కి ఉంచడం మంచిది ఇలా చేయడం వల్ల ఆర్ధిక నష్టం ఉండదు. మీరు కావాలంటే పైన ఎత్తులో పెట్టి దానికి తాడు కట్టి తీగలాగ ఉంచొచ్చు. ఇది మీకు అదృష్టాన్ని తీసుకు వస్తుంది మరియు పాజిటివిటీని పెంచుతుంది.

ఎప్పుడైనా మనీప్లాంట్ కి నీళ్ళు పోసేటప్పుడు కొద్దిగా పాలు కూడా కలిపి పోయండి. ఇలా చేయడం వల్ల ధనం పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆనందం, శాంతి కలగాలని కోరుకుంటారు ఎటువంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు.

అలా మీ ఇంట్లో కూడా గొడవలు జరగకుండా ఉండాలంటే వంట గదిలో మెడిసిన్స్ పెట్టద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు వంటివి రాకుండా ఉంటాయి. కనుక ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి ఇంట్లో సమస్యల నుంచి బయటపడండి.