వీధిలో తిరిగే నల్ల పిల్లి ఇంట్లోకి వస్తే ఏం అవుతుంది..? మంచిది కాదా..?

-

చాలామంది పిల్లిని అపశకునంగా భావిస్తారు. నల్ల పిల్లి ఎదురైతే ఆ రోజంతా ఏదో కీడు జరగబోతుంది అని కూడా అనుకుంటారు. పైగా నల్ల పెల్లి ఎదురైతే చేయబోయే పనిని కూడా ఆపేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. నల్ల పిల్లి ఎదురు వస్తే అసలు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతారు. లేదా ఇంట్లోకి వెళ్లి మళ్లీ బయటకు బయలుదేరుతారు. అయితే వీధిలో వెళ్లే పిల్లి సడన్ గా ఇంట్లోకి వస్తే దానికి అర్థం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఈజిప్షియన్లు పిల్లుల్ని పెంచుకునేవారు దైవంగా భావించి పూజలు కూడా చేసేవారు. దుష్టశక్తులు కనిపిస్తాయని నమ్మేవారు.

కనుక అవి వారి ఇంటి దగ్గర ఉన్నట్లయితే మన దగ్గరికి దుష్ట శక్తులు రావని భావిస్తారు. అందుకే పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. ఇప్పుడు చాలా మంది పెంచుకోవట్లేదు. వీధుల్లో మాత్రం మనకు అప్పుడప్పుడు పిల్లలు కనబడుతూ ఉంటాయి. అవి ఎవరింట్లోకి పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళవు. కొందరి ఇళ్లల్లోకి మాత్రమే వెళుతూ ఉంటాయి. కొందరి ఇళ్లల్లోకి అయితే వీధి పిల్లలు సడన్ గా వస్తూ ఉంటాయి. దీనికి అర్థం ఏంటనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. వీధుల్లో తిరిగే పిల్లి సడన్ గా ఇంట్లోకి వచ్చిందంటే ఆ ఇంట్లోనే వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని దానికి అర్థం.

ఆ పిల్లి వాళ్ళకి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్లు అర్థం చేసుకోవాలి. ఇంటి యజమాని జీవితంలో అనేక మార్పులు వస్తాయట. దాన్ని తెలపడం కోసం కొన్ని సార్లు వీధుల్లో తిరిగే పిల్లలు ఇంట్లోకి సడన్ గా వచ్చేస్తూ ఉంటాయట. పిల్లి అలా సడన్గా ఇంట్లోకి వస్తే యజమాని జీవితంలో మార్పు చోటు చేసుకోబోతోంది. ఏదో మలుపు తిప్పే మార్పు రాబోతోంది అని అర్థం చేసుకోవాలి. అలా ఇంట్లోకి వస్తే యజమాని జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదు. చేసే పనుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దీంతో జీవితంలో వచ్చే ఎలాంటి మార్పుల్ని అయినా ముందే పసిగట్టి ఎదుర్కోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news